Free Tourist Visas: శ్రీలంక దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న టూరిజంపై ఆ దేశం మరింత దృష్టి పెట్టింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం టూరిస్టులను ముఖ్యంగా భారత్ నుంచి వచ్చే పర్యాటకులను అట్రాక్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. భారత్ నుంచే శ్రీలంకకు ఎక్కువ పర్యాటకులు వెళ్తున్న క్రమంలో మన దేశానికి చెందిన పౌరులకు ‘ఫ్రీ టూరిస్ట్ వీసా’లను మంజూరు చేయనున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషషన్ శాఖ కొలంబోలో ప్రకటించింది.
శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.