Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreesanth: భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. 2023 డిసెంబర్లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తీవ్రమైన వాగ్వాదం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ సమయంలో గంభీర్ తనను ‘ఫిక్సర్’ అని దూషించాడంటూ శ్రీశాంత్ గతంలోనే ఆరోపించాడు. అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ గొడవకు సంబంధించిన మరికొన్ని షాకింగ్ నిజాలను శ్రీశాంత్ బయటపెట్టాడు. గంభీర్ తనను కేవలం ఫిక్సర్ అనడమే కాకుండా, ‘దేశద్రోహి’ అని కూడా సంబోధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘ది లల్లన్‌టాప్’ ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆనాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ.. మ్యాచ్ సందర్భంగా తాను గంభీర్‌కు ఒక బౌన్సర్ వేసిన తర్వాత ఈ గొడవ మొదలైందని చెప్పాడు. “గౌతీ (గంభీర్) చాలా మంచి క్రికెటర్, నా ఆట తీరు అతనికి బాగా తెలుసు. అందుకే నేను వేసిన మొదటి బంతికే అతను ముందుకు వచ్చి ఫ్లిక్ షాట్ ఆడాడు. కోచింగ్ విషయంలో అతని ప్రతిభ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, ఒక క్రికెటర్‌గా మాత్రం అతను గొప్పోడే. ఆ షాట్ తర్వాత నేను అతనికి ఒక బౌన్సర్ వేశాను” అని శ్రీశాంత్ వివరించాడు. ఆ బౌన్సర్ తర్వాత గంభీర్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడని, నేరుగా తనపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడని శ్రీశాంత్ ఆరోపించాడు. “ఆ బౌన్సర్ తర్వాత గంభీర్ నా వైపు చూస్తూ ‘ఐ ఓన్ యూ’ (నువ్వు నా చేతిలో ఉన్నావ్) అన్నాడు. నన్ను స్పష్టంగా బూతులు తిట్టాడు. అసలు అనకూడని మాట అన్నాడు.. నన్ను ‘ఫిక్సర్’ అని పిలిచాడు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. గంభీర్ అలా అనేసరికి తాను కాస్త ముందుకు వంగి, ‘గౌతీ భాయ్, మీరు బానే ఉన్నారా?’ అని అడిగానని శ్రీశాంత్ చెప్పాడు. అయితే తాను భారీ కాయంతో ఉండటం వల్ల గంభీర్‌ను కొట్టడానికి వెళ్తున్నట్లుగా కనిపించి ఉండవచ్చని, కానీ గంభీర్ మాత్రం ‘F’ అక్షరంతో మొదలయ్యే బూతు మాటలు వాడుతూ, మళ్లీ ‘ఫిక్సర్’, ‘దేశద్రోహి’ అని అరిచాడని శ్రీశాంత్ సంచలన క్లెయిమ్ చేశాడు.
Also Read
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
- Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
నిజానికి గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములు. 2007 టీ20 ప్రపంచ కప్, అలాగే 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్లలో వీరిద్దరూ కలిసి ఆడారు. కానీ, ఆటగాళ్లుగా రిటైర్ అయిన తర్వాత వీరి మధ్య సంబంధాలు ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో ఈ తాజా వివాదం స్పష్టం చేస్తోంది. 2013 ఐపీఎల్ సీజన్లో శ్రీశాంత్‌పై వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల ఆధారంగానే గంభీర్ ఆనాడు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ కేసులో శ్రీశాంత్‌పై మొదట బీసీసీఐ జీవితకాల నిషేధం విధించినప్పటికీ, ఆ తర్వాత దానిని ఏడేళ్లకు తగ్గించింది. దీంతో 2020లో శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడటానికి అర్హత సాధించాడు.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?