యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గత ఏడాది వరుస సినిమాలతో బిజీ గా వున్న ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక చాలా సినిమాలు వదులుకుంది.కానీ ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి .గత ఏడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదల అవ్వగా అందులో భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అంత స్కోప్ ఉండదు.ప్రస్తుతం ఈ భామ చేతిలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే వుంది.ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు రావడం లేదు.
అయితే తాజాగా ఈ భామకు కోలీవుడ్ నుంచి బిగ్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వచ్చినట్లు సమాచారం.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ,వెంకట్ ప్రభు కాంబినేషన్ లో వస్తున్న “ది గోట్ ” మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం.కానీ ఈ ఆఫర్ శ్రీలీల తిరస్కరించినట్లు సమాచారం.అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సరసన “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే చిత్రంలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తుంది. ఈ మూవీని మార్క్ ఆంటోనీ ఫేమ్ “అధిక్ రవిచంద్రన్” తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ఒప్పుకొని నిండా మునిగిన శ్రీలీల కోలీవుడ్ లో ఆ తప్పు చేయకూడదని విజయ్ మూవీ ఆఫర్ తిరస్కరించినట్లు సమాచారం .