Sreeleela : అయింది చాలు.. ఇక వాటికి నో చెప్పేసిన శ్రీలీల
- పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ చేసిన శ్రీలీల
- ఇక మీదట స్పెషల్ సాంగ్ కు నో
- అల్లు అర్జున్ మీద ఇష్టంతో చేసిన శ్రీలీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreeleela : అందాల భామ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. తొలుత ఈ ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ భావించారు. అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని అనుకున్నారు. అందుకే పలువురు హీరోయిన్లను పరిశీలించిన తర్వాత సాహో సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రద్దా కపూర్‌తో చేయించాలని అనుకున్నారు. ఆమెను సంప్రదించగా ఓకే చెప్పింది. అయితే పారితోషికం విషయంలో ఇబ్బంది ఏర్పడిందట. సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమె పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఆమె ఏకంగా రూ.8కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో నిర్మాతలు అమ్మ బాబోయ్ మా వల్ల కాదంటూ ఆమెతో చర్చలు జరపడం ఆపేశారట. సుకుమార్‌కి సైతం అంత పారితోషికం ఇచ్చి శ్రద్ద కపూర్‌తో ఆ పాట చేయించాలని అనుకోలేదట. అందుకే అల్లు అర్జున్ సూచనతో శ్రీలీలను సెలక్ట్ చేసి ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. సాధారణంగా శ్రీలీల ఐటెం సాంగ్స్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయమని అడిగితే నో చెప్పింది. అంతే కాకుండా చిరంజీవి సినిమా విశ్వంభరలోనూ శ్రీలీల ప్రత్యేక పాటలో నటించేందుకు అడిగితే నో చెప్పిందట. అందుకే పుష్ప 2 లో ఆమె నటించేందుకు ఒప్పుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also:Syria-Lebanon: సిరియాలో ఉద్రిక్తత.. 2 వేల యోధులను పంపిన లెబనాన్
Also Read
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ చేయడంతో పాటు, వారం రోజుల పాటు డేట్లు ఇస్తేనే భారీ పారితోషికం అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు ఆఫర్ ఇచ్చారు. అల్లు అర్జున్‌తో డాన్స్ చేయాలనే కోరిక శ్రీలీలకు చాలా కాలంగానే ఉంది. ఆయనతో సినిమాలో నటించే అవకాశం వస్తుందో లేదో అందుకే కిస్సిక్ సాంగ్ లో చేసేద్దాం అని శ్రీలీల అనుకుందట. అందుకే శ్రీలీల సాంగ్‌లో నటించి మెప్పించింది. పుష్ప 2 లో ఐటెం సాంగ్ చేయాలని ఆమెను అడిగిన వెంటనే ఏ మాత్రం రెండో ఆలోచన లేకుండా అల్లు అర్జున్ కోసం, ఆయనతో డాన్స్ చేయడం కోసం, పుష్ప కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓకే చెప్పిందట. ఇకపై ఎంత పెద్ద హీరో వచ్చి చేయమన్నా శ్రీలీల ఐటెం సాంగ్ లకు ఎస్ చెప్పదట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ కోసం కిస్సిక్ చేశానే తప్ప ప్రత్యేకంగా తాను ఐటెం సాంగ్ చేయాలని అనుకోలేదు. ఇకపై ఎవరైనా తనను ఐటెం సాంగ్ కోసం సంప్రదిస్తే కచ్చితంగా నో అని చెబుతానని తెలిపింది. నో అంటే నో అని చెబుతానంటూ చెప్పిన శ్రీలీల ప్రస్తుతం నితిన్‌తో కలిసి రాబిన్ హుడ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
Read Also:Fire Breaks Out In Running Car: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు.. పరుగులు తీసిన భక్తులు
తాజావార్తలు
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
-
SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!