Sreeleela-Krithi Shetty: హిట్టు కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళినా.. శ్రీలీల, కృతి శెట్టిలకు తప్పని తిప్పలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలిగిపోయిన హీరోయిన్లు ఇతర భాషల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం సహజం. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీలు శ్రీలీల, కృతి శెట్టిలకు మాత్రం ఎక్కడా సక్సెస్ దొరకడం లేదు. తెలుగులో వరుస ప్లాపులు పలకరించడంతో కోలీవుడ్‌లో పాగా వేయాలని చూసిన ఈ ముద్దుగుమ్మలకు అక్కడ కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.
Also Read: Bharatavarsha: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గోపీచంద్ ‘భరతవర్ష’.. టైటిల్ గ్లింప్స్!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
మాస్ రాజా రవితేజ ‘ధమాకా’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల, ఆ తర్వాత తెలుగులో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమె ఆశలన్నీ శివకార్తికేయన్ సరసన నటించిన తమిళ చిత్రం ‘పరాశక్తి’ మీదే పెట్టుకుంది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో బిజీ అయిపోవచ్చని భావించిన శ్రీలీలకు నిరాశే ఎదురైంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, ఆమెకు అక్కడ రావాల్సిన అవకాశాలను కూడా దెబ్బతీసింది. ఇక మరోవైపు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ ఏడాది జనవరిలో ‘అన్నగారు వస్తారు’ సినిమాతో ప్లాప్ అందుకున్న కృతి, తాజాగా ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) పై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో తెలుగులో పోయిన క్రేజ్‌ను తమిళంలో సంపాదించుకుందామనుకున్న కృతి ప్లాన్ రివర్స్ అయ్యింది.
అయినప్పటికీ, ఈ ఇద్దరు భామలు ఇంకా రేసులో ఉన్నారు. కృతి శెట్టి ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. మరోవైపు, శ్రీలీల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకుంది. మరి ఈ రెండు సినిమాలైనా వీరిద్దరికీ సాలిడ్ హిట్ ఇచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!