Bindi Benefits: మన భారతీయ సనాతన సంప్రదాయంలో నుదుటి బొట్టు లేదా తిలకధారణ కేవలం అలంకారం మాత్రమే కాదు.. అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రాముఖ్యత కలిగిన ఆచారం. మన అమ్మమ్మలు, అమ్మలు నుదుటిన ధరించే కుంకుమ బొట్టు వెనుక ఎన్నో ఆరోగ్య, ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వివిధ శాస్త్రాలు చెబుతున్నాయి. కాలం మారినా బొట్టు రూపం మారినా.. అది మహిళలకు సంపూర్ణమైన లుక్ ఇవ్వడంతో పాటు శరీరానికి, మనస్సుకు సమతుల్యతను అందిస్తుంది. మరి ఇంతటి ప్రయోజనాలు ఉన్న బొట్టును పెట్టుకోవడం చాలామంది మానేశారు. ముఖ్యంగా మగవారు సిగ్గుతో, ఫ్యాషన్ పేరుతో ఆడవారు బొట్టు పెట్టుకోవడం మానేశారు.
katrina kaif-vicky : బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..హ్యాపీ న్యూస్‌తో సోషల్ మీడియాలో హడావిడి!
యోగ రహస్యం:
బొట్టు ధరించే స్థానం యోగశాస్త్రం ప్రకారం “అజ్ఞా చక్రం” (ఆరవ చక్రం)గా పిలవబడుతుంది. ఇది మానవ శరీరంలోని అత్యంత శక్తివంతమైన చక్రం. ఈ ప్రాంతం నుండి ప్రాణశక్తి కిరణాలు ప్రసారం అవుతాయి. కళ్లు, మెదడు, పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన నాడులు ఇక్కడే కేంద్రీకృతమై ఉంటాయి. బొట్టు పెట్టేటప్పుడు ఆ పాయింట్‌ను ఒత్తడం వల్ల నాడులు ఉత్తేజం చెంది మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆందోళన తగ్గడం వంటివి కలుగుతాయి. అందుకే దీన్ని “మూడవ కన్ను” లేదా “మేల్కొలుపు కేంద్రం” అని పిలుస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. నుదుటి బొట్టు లేదా ఆ పాయింట్‌పై మర్దన చేయడం ఆక్యుప్రెజర్ సూత్రాల ప్రకారం పనిచేస్తుంది. ఇది తలనొప్పిని తగ్గించి మెదడుకు విశ్రాంతి కలిగిస్తుంది. ట్రిజెమినల్ నరాలను ఉత్తేజపరిచి సైనస్ సమస్యలు, నాసికా వాపులు తగ్గిస్తాయి. సుప్రట్రోక్లియర్ నరాలకు అనుసంధానమై ఉండటం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అజ్ఞా చక్రం ఉత్తేజంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే ముఖ కండరాలకు రక్తప్రసరణ పెరగడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా వినికిడి శక్తి, అంతర్దృష్టి పెరగడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు ఉపశమనంగా కూడా ఇది పనిచేస్తుంది.
అదృష్టం, ఐశ్వర్యం కోసం జ్యోతిష్య పరిహారం:
జ్యోతిష్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. అదృష్టం, ఐశ్వర్యం పొందాలంటే మహిళలు “సప్త మృత్తికా బొట్టు” ధరించాలి. ఇది కాశీ, అయోధ్య, రుషికేశ్, హరిద్వార్, ప్రయాగ, గయ, త్రివేణి సంగమం వంటి ఏడు పవిత్ర క్షేత్రాల మట్టిని కలిపి తయారు చేస్తారు. ఈ పవిత్ర మట్టిని నుదుటిపై బొట్టుగా పెట్టి దానిపై కుంకుమ బొట్టు ధరించడం వల్ల అదృష్టం కలుగుతుంది. సర్పదోషం, కుజదోషం తొలగి, రుణబాధలు, శత్రువుల ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపార వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.