అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో విధిగా స్వచ్ఛ తాగునీటిని ఉచితంగా అందించాలన్నారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగు నీటిని గానీ, ఆర్.ఓ . వాటర్, శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు.
Also Read : World Worst Currency no-3: ప్రపంచంలోనే 3వ అతి చెత్త కరెన్సీగా రూబుల్
ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ, హోటళ్లు, రెస్టారెంట్లలో తప్పని సరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లలో వేరు వేరు బ్రాండ్ల పేరుతొ బాటిల్ వాటర్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు.
Also Read : Covid Mock Drill: కోవిడ్ ఎదుర్కొనేందుకు సిద్ధం.. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్