Tammineni Sitaram: టీడీపీ ఎమ్మెల్యేల చేష్టలపై మాట్లాడాలంటేనే బాధగా ఉందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారం.. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయం హాట్ హాట్ గా ఉంది.. సభ్యులు శాసనసభ నియమావళి సాంప్రదాయాలు పాటించాలని సూచించారు.. కానీ, టీడీపీ సభ్యుల చేష్టలపై మాట్లాడాలంటే నాకు బాధగా ఉందన్నారు. నేను శాసనసభలో ఉన్నాను బాధ్యతగా వ్యవహరించాలని సభ్యులకు ఉండాలి.. సస్పెన్షన్ ఒక్కటే కాదు అనుచిత ప్రవర్తన మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అన్నారు తమ్మినేని..
నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని.. నేను వైఎస్ జగన్ ఇచ్చిన టికెట్ పైన గెలుపొందాను.. నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అనే కోణంలోనే టీడీపీ వారుచూస్తున్నారు.. శాసనసభాపతిగా సభలో తరతమ భేదం లేకుండా చూస్తున్నాను అన్నారు స్పీకర్ తమ్మినేని.. విశాఖ నుండి పరిపాలన రాజధాని ప్రారంభమవుతుంది.. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని తెలిపారు. అచ్చెన్నాయుడు, బాలకృష్ణకు అనేకసార్లు చెప్పాము.. వినలేదు.. ప్రిపెడ్ మైండ్ తోనే టీడీపీ సభ్యలు వచ్చారు. సభను అడ్డుకోవాలని చూశారు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై డిస్కషన్ కు పెట్టాం వారు సద్వినియోగం చేసుకోలేదన్నారు. టీడీపీ అధినేతను అరెస్టు చేశారు.. దానిని ప్రభుత్వం పై ఆపాదిస్తున్నారు.. ప్లకార్డులు ప్రదర్శించడం, విజిల్స్ వేయడం అక్కడున్నటువంటి సామానులు ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ముఖ్యమంత్రిగా గెలిచి చంద్రబాబు సభలో అడుగుపెడతానన్నారు.. అది అయన వ్యక్తిగత అభిప్రాయం.. చంద్రబాబు అరెస్టుపై చైర్ కు ముందుగానే సమాచారం ఇచ్చారని తెలిపారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ కేసు ఫైల్ అయ్యిందని వెల్లడించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.