Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Spain Free House Job Offer Arenillas Village

Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

Published Date :April 9, 2026 , 2:43 pm
By RAMAKRISHNA KENCHE
Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Free House and Job: ఉచితంగా ఇల్లు ఓ ఉద్యోగం ఇస్తారంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు. ఓటేసి ఎంచుకున్న ప్రభుత్వాలే ప్రజల్ని సరిగ్గా పట్టించుకోని ఈ రోజుల్లో ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తారంటే ఎగిరి గంతేస్తారు. కానీ.. ఇక్కడ ఓ మెళిక ఉందండోయ్. ఆ మెళిక ఏంటి? ఈ ఆఫర్ ఎక్కడ ఇచ్చారు? ఎందుకు పెట్టారు? అనే పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..

READ MORE: Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

స్పెయిన్‌లోని సోరియా ప్రావిన్స్‌లో ఉన్న అరెనిల్లాస్ (Arenillas) అనే చిన్న గ్రామం జనవాసం లేక నిర్జన గ్రామంగా (Ghost Town) మారే పరిస్థితికి చేరుకుంటోంది. ఈ క్రమంలో గ్రామాన్ని కాపాడుకోవడానికి అక్కడి స్థానిక యంత్రాంగం ఓ వినూత్న, అందరినీ ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఖాళీ అవుతున్న స్పెయిన్’ (Empty Spain) అనే కార్యక్రమంలో భాగంగా, ఇక్కడికి వచ్చి శాశ్వతంగా నివాసం ఉండే కుటుంబాలకు ఉచితంగా ఇల్లు, దాంతోపాటే ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక బలమైన సామాజిక లక్ష్యం ఉంది.

గత 50 ఏళ్లుగా యువత ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లడంతో అరెనిల్లాస్ లాంటి గ్రామాలు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు, పాడుబడిన పాత డాక్టర్ క్లినిక్, పాత పాఠశాల భవనాలను ఆధునిక నివాసాలుగా మార్చిన గ్రామ కౌన్సిల్, ఒక అదృష్టవంత కుటుంబానికి ఈ ఇంట్లో అద్దె లేకుండా ఉండే అవకాశం కల్పిస్తోంది. అయితే, ఇక్కడ చేరే కుటుంబానికి రెండు కీలక బాధ్యతలు ఉంటాయి. ఒకటి, గ్రామంలోని ఏకైక సామాజిక కేంద్రమైన ‘సోషల్ బార్’ను నిర్వహించడం. రెండు గ్రామంలో జరిగే పునరుద్ధరణ పనులకు మున్సిపల్ మేస్త్రీగా సేవలు అందించడం. ఈ రెండు పనులు తప్పక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పనులు చేయడం వల్ల గ్రామంలోని మిగిలిన ప్రజలకు అవసరమైన సేవలు అందుతూ, ఆ ఊరు ఒక ‘ఎడారిలో సరస్సు’లా కళకళలాడుతుందని అక్కడి పాలనా వ్యవస్థ నమ్ముతోంది. అయితే.. ఇంత భారీ ఆఫర్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి.

READ MORE: Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

అంతేకాదు.. ఈ పథకం మీకు రావాలంటే మరికొన్ని నిబంధనలు తప్పనిసరి. అందులో మొదటిది, దరఖాస్తు చేసుకునే కుటుంబంలో పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లలు ఉండాలి. ఎందుకంటే, ఆ గ్రామంలో స్కూల్ మూతపడి చాలా ఏళ్లయింది. ప్రస్తుతం అక్కడ ఉన్న పిల్లలను 20 కిలోమీటర్ల దూరంలోని ‘బెర్లంగా డి డ్యూరో’ పాఠశాలకు పంపడానికి గ్రామ కౌన్సిల్ నిధులతో షటిల్ సర్వీస్ నడుపుతోంది. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబం వస్తే, భవిష్యత్తులో ఈ విద్యా రవాణా వ్యవస్థను బలోపేతం చేయవచ్చని వారి ఆలోచన. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామ కౌన్సిల్‌కు వీసాలు ఇచ్చే అధికారం లేదు. కాబట్టి, యూరప్ బయట నుంచి వచ్చే వారు దరఖాస్తు చేసుకోవాలంటే, అప్పటికే వారి వద్ద స్పెయిన్‌లో ఉండేందుకు చెల్లుబాటు అయ్యే నివాస, పని అనుమతి పత్రాలు (Residency and Work Permits) ఉండాలి. శిథిలావస్థకు చేరిన భవనాలను నివాసాలుగా మార్చి గ్రామాన్ని కాపాడుకుంటున్న అరెనిల్లాస్ మోడల్ ఇప్పుడు ఒక సక్సెస్ స్టోరీగా నిలిచింది. స్పెయిన్‌లోని వందలాది ఇతర గ్రామాలను కాపాడేందుకు ప్రాంతీయ ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని ఒక కేస్ స్టడీగా పరిశీలిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arenillas village Spain
  • Empty Spain program
  • free home Europe
  • free house job scheme
  • move to Spain village

తాజావార్తలు

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions