SpaceX: ఎలోన్ మస్క్‌కి చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ అంతరిక్ష శాస్త్ర ప్రపంచంలో సరికొత్త అద్భుతాన్ని ప్రదర్శించింది. ఇప్పటి వరకు మీరు రాకెట్లను ప్రయోగించడం వల్ల రాకెట్స్ అంతరిక్షంలోకి వెళ్లడం చూసి ఉంటాము. కానీ., ప్రపంచంలోనే మొదటిసారిగా అంతరిక్షం నుండి భూమిపై రాకెట్ సురక్షితంగా ల్యాండ్ చేయబడింది. ఈ విజయాన్ని ఎలోన్ మస్క్ కంపెనీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో అంగారకుడిపై స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కల నెరవేరుతుందన్న ఆశలు చిగురించాయి.
Selfie Death: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి.. మహానంది క్షేత్రం సమీపంలో యువకుడు మృతి..
ఇకపోతే., స్పేస్ x ముందుగా ఈ సూపర్ హెవీ బూస్టర్‌ను భూమికి 96 కి.మీ ఎత్తుకు పంపి, తర్వాత కిందకు దించారు. క్రింద, మకాజిలా (Maczilla) అనే వ్యవస్థ దానిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంచారు. రాకెట్ కిందకు దిగిన వెంటనే, మకాజిలా తన రెండు మెటల్ చేతులతో దానిని పట్టుకుంది. అవి మెటల్ చాప్ స్టిక్స్ లాగా కనిపిస్తాయి. స్పేస్‌ఎక్స్ ఇంజనీర్లు బూస్టర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు ప్రకటించిన వెంటనే, అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో కొత్త చరిత్ర నమోదైంది. భూ వాతావరణంలోకి మళ్లీ ప్రవేశించిన తర్వాత హిందూ మహాసముద్రంలో నియంత్రిత ల్యాండింగ్ చేయడం ఇదే తొలిసారి. స్టార్‌షిప్ భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, దాని వేగం గంటకు 26,000 కిలోమీటర్లు, ఉష్ణోగ్రత 1,430 ° C గా ఉన్నాయి.
ఈ స్టార్‌షిప్‌లో 6 రాప్టర్ ఇంజన్‌లు ఉన్నాయి. అయితే, సూపర్ హెవీలో 33 రాప్టర్ ఇంజన్‌లు ఉన్నాయి. కాబట్టి దాని తొలగింపు సౌలభ్యం గురించి ఒక ప్రశ్న ఉంది. ఇంతకు ముందు 4 టెస్టులు విఫలమయ్యాయి. తొలి టెస్టులో ప్రయోగించిన 4 నిమిషాలకే పేలుడు సంభవించింది. రెండో టెస్టులో స్టేజ్ సెపరేషన్ తర్వాత లోపం ఏర్పడింది. మూడవ పరీక్షలో, భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన తర్వాత స్టార్‌షిప్‌తో సంబంధం కోల్పోయింది. నాల్గవ పరీక్ష విజయవంతమైంది. ఆ సమయంలో నీటిలో ల్యాండింగ్ జరిగింది.
And this Sunday, I’m happy to be a couch potato, if it means that I get to watch history being made.
This experiment may just be the critical moment when space travel was democratised and made routine.
Where can I buy my ticket, @elonmusk ?
👏🏽👏🏽👏🏽
— anand mahindra (@anandmahindra) October 13, 2024