Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News South First Poll Predicts Congress Will Emerge As Single Largest Party In Tight Fight In Karnataka

Karnataka: హంగ్‌ దిశగా కర్ణాటక.. ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడి

Published Date :January 5, 2023 , 12:16 pm
By Mahesh Jakki
Karnataka: హంగ్‌ దిశగా కర్ణాటక.. ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Karnataka: కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ జరగనుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడైంది. ‘సౌత్‌ ఫస్ట్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌ సంస్థ – ‘సిస్రో’ తో కలిసి తాజాగా ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాల్లో, మెజారిటీ రాకపోయినా… కాంగ్రెస్‌ అత్యధిక స్థానాలు సాధిస్తుందని, మొత్తం మీద హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నాయని ట్రాకర్‌ పోల్‌లో వెల్లడైంది.

పీపుల్స్‌ పల్స్‌ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి గురువారం నాడు మొదటి ట్రాకర్‌పోల్‌ ఫలితాలను విడుదల చేశారు. మొదటి ట్రాకర్‌ పోల్‌ 2022 డిసెంబర్‌ 22 నుండి 31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన తాజా సర్వే గణాంకాలను శాస్త్రీయంగా అన్వయించి విశ్లేషించి, సిస్రో వ్యవస్థాపక డైరెక్టర్‌ ధనుంజయ్‌ జోషి ఆధ్వర్యంలో నివేదికను రూపొందించారు. ఎన్నికల లోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే జరగనుంది. మరో రెండు మార్లు ట్రాక్‌ పోల్స్‌ సర్వేను 2023 మార్చిలో ఒకసారి, సరిగ్గా ఎన్నికల ముందు మరోసారి చేపడుతారు.

Also Read

  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!
  • Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
  • AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే
  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

Read Also: SM Krishna Retirement: రాజకీయాలకు సీనియర్‌ నేత గుడ్‌బై.. బీజేపీ లైట్‌ తీసుకుందా..?

కర్ణాటకలో గత మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా తిరిగి విజయం సాధించలేదు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలయ్యి, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌, జేడి(ఎస్‌) పార్టీలు ధీమాతో ఉన్నాయి.
పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్‌/మైనస్‌ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్‌/మైనస్‌ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడీ (ఎస్‌) 29 (ప్లస్‌/మైనస్‌ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది.

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 స్థానాల మెజార్టీ సంఖ్యను ఏ పార్టీ సాధించలేకపోతోంది. 2018 ఎన్నికల తర్వాత రెండు పార్టీల కూటమి ప్రభుత్వం మరోసారి ఏర్పడే అవకాశాలున్నాయి. రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో తాము కీలకంగా మారనున్నామని జేడీ(ఎస్‌) ఇప్పటికే చెబుతూ వస్తోంది. వాస్తవిక ఫలితాలు ట్రాకర్‌పోల్‌ సర్వే అంచనాల ప్రకారంగానే ఉంటే, అదే నిజమై జేడీ(ఎస్‌) కీలకం కానుంది. ట్రాకర్‌పోల్‌ సర్వే గణాంకాల ప్రకారం కాంగ్రెస్‌ 2018 ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం ఓట్లను పెంచుకొని 22 స్థానాలను అధికంగా సాధిస్తుందని తేలింది. 2018లో 38 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి 40 శాతం సాధిస్తుందని రహస్య బ్యాలెట్‌ ద్వారా నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది.

Read Also: Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..

అదే సమయంలో బీజేపీ కి, 2018 ఎన్నికలతో పోలిస్తే 0.2 శాతం ఓట్లు తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. 2018లో 36.2 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు 36 శాతం ఓట్లు సాధిస్తుంది. ఈ స్వల్ప వ్యత్యాసంతో ఆ పార్టీ 13 స్థానాలు కోల్పోనుంది. పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థల సర్వే ప్రకారం, జేడీ(ఎస్‌) ఈ ఎన్నికల్లో కిందటి ఎన్నికల కన్నా తక్కువ ఓటు షేరుతో, తక్కువ సంఖ్యలో సీట్లు సాధిస్తూ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనుంది. ఈ పార్టీ 16 శాతం ఓట్లు సాధించనుంది. 2018 ఎన్నికలతో పోలిస్తే 2.4 శాతం తక్కువ సాధించి 29 సీట్లు (కిందటిసారి వారి సంఖ్య 37) పొందుతుంది. జేడీ(ఎస్‌) దృష్ట్యా చూస్తే ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగినా దాదాపు తన ఓటు బ్యాంకును నిలుపుకోవడం ఎంతో కీలకం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలంటే తన ఓటు బ్యాంకును జెడీఎస్‌ నిలుపుకోవడంతోపాటు అధిక సీట్లను సాధించాలి.

కర్ణాటక ఎన్నికల్లో కులాలతో పాటు మత అంశాలు కూడా కీలకంగా మారనున్నాయని ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. ఓబీసీలు, మాదిగలు, హోలియాలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిస్తున్నారు. మరోవైపు అగ్రకులాలు, వొక్కలింగాలు, లింగాయత్‌లు బీజేపీ వెంట ఉన్నట్లు ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. జేడీ(ఎస్‌) ప్రధాన ఓటు బ్యాంకు అయిన వొక్కలింగాలలో 50 శాతం మంది ఈ పార్టీకి మద్దతుగా ఉన్నారు.అహిందా కూటమి, వొక్కలింగాయతేతరులైన ఓబిసీలు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ కొంతమేర ఆధిపత్యం పొందుతుందని ట్రాకర్‌పోల్‌లో తేలింది. 2013, 2018 కాంగ్రెస్‌పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాలంలో, ఆయా వర్గాల సంక్షేమ పథకాల ప్యాకేజీలను అందజేయడం, సమర్థంగా అమలుపరచడంతో కాంగ్రెస్‌కు పార్టీకి వీరి నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోంది. పీపుల్స్‌పల్స్‌- సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన ట్రాకర్‌పోల్‌ సర్వేలో, కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు సిద్దరామయ్యకు 28 శాతం మద్దతిచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మైకు 19 శాతం, కుమారస్వామికి 18 శాతం మంది నుంచి మద్దతు లభించింది.

Read Also: Kamareddy New Master Plan: కొత్త మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకోకపోతే ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం

హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ఏయే పార్టీలు కూటమిగా ఏర్పడాలన్న నిర్దిష్ట ప్రశ్నకు, కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 41 శాతం, బీజేపీ, జేడీ(ఎస్‌) కూటమి ప్రభుత్వం ఏర్పడాలని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. అవినీతి, ఉద్యోగ నియామకాలలో కుంభకోణాలు, నిరుద్యోగం, పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అంశాలు బీజేపీకి అడ్డంకులుగా ఉన్నాయని ఈ ట్రాకర్‌పోల్‌ సర్వేలో తేలింది. రైతులలో 40 శాతం, నిరుద్యోగులలో 41 శాతం కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్‌కు 8 శాతం ఆధిపత్యం లభిస్తుండగా, బీజేపీకి పట్టణ ప్రాంత్రాల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఆధిక్యం కనిపిస్తుంది. కర్ణాటక అభివృద్ధికి ఏ పార్టీ పాలన మెరుగైనదని ప్రశ్నించినపుడు, 38 శాతం కాంగ్రెస్‌, 36 శాతం బీజేపీ, 18 శాతం జేడీ(ఎస్‌)కి అనుకూలంగా ఓటర్లు స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తుందని అడిగినపుడు, 38 శాతం మంది కాంగ్రెస్‌ అని, 37 శాతం మంది బీజేపీ అని తెలిపారు. బీజేపీకి మరో మారు అవకాశమిస్తారా అని ప్రశ్నించగా 51 శాతం మంది లేదని, 41 శాతం ఔనని తెలిపారు. సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ -సిస్రో రీసెర్చ్‌ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే, హోరాహోరీ పోరులో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనబడుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పలు రాజకీయ పరిణామాలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.

సౌత్‌ ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌-సిస్రో రీసెర్చ్‌ సంస్థలు ఈ సర్వేను 56 అసెంబ్లీ స్థానాల్లో 224 పోలింగ్‌ బూత్‌లను ఎంపిక చేసుకొని మొత్తం 4584 శాంపిల్స్‌ (ఓటర్ల) నుంచి సమాచారాన్ని సేకరించారు. జనాభా దామాషాను పరిగణనలోకి తీసుకొని, సామాజిక వర్గాల ఆధారంగా రాండమ్‌ పద్దతి ఎంపిక ద్వారా ఈ శాస్త్రీయ సర్వే జరిగింది. 22 డిసెంబర్‌ నుంచి 31డిసెంబర్‌ 2022 వరకు ఈ ట్రాకర్‌పోల్‌ సర్వే ప్రక్రియ సాగింది. మార్చి 2023 లో ఒకసారి, ఎన్నికల ముందు మరోమారు సర్వేను నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ నుంచి 35 మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో సీఏపీఐ (కంప్యూటర్‌ అసిస్టెడ్‌ ఇంటర్‌పర్సనల్‌ ఇంటర్వీయింగ్‌) పద్దతిన డేటా సేకరణ జరిపి, ఓటర్లను ముఖాముఖి కలుసుకుని, ఈ సర్వేలో అవసరమైన ప్రశ్నలు వేస్తూ డమ్మీ ఈవీఎమ్‌ ద్వారా రహస్య ఓటింగ్‌ నిర్వహించారు.

Read Also: Microsoft CEO Meet PM: ప్రధాని మోదీని కలిసిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • hung in karnataka
  • JDS
  • karnataka

తాజావార్తలు

  • Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్‌-ఎన్యుమ‌రేష‌న్‌ ప్రారంభం..!

  • Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

  • AshuReddy : నటి అషు రెడ్డిపై నమోదైన చీటింగ్ కేసు వివరాలు..పెద్ద స్కెచ్చే

  • IPL Historic Day: బ్యాట్స్‌మెన్‌ల మెరుపులు, భారీ స్కోర్లు, రికార్డు ఛేజింగ్‌లు.. ఐపీఎల్ చరిత్రలో చారిత్రాత్మక రోజు!

  • Gayapadda Simham: తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’లో శ్రీ విష్ణు మేజిక్..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions