21 Percent Discount on Vivo T1X Smartphone in Flipkart: ఇటీవలి రోజుల్లో ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ వరుస సేల్‌లతో కస్టమర్ల ముందుకు వస్తోంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’, ‘బిగ్ బచాత్ ధమాల్ సేల్’, ‘గ్రాండ్ హోమ్ అప్లియెన్సెస్ సేల్’లను తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఆగష్టు 16 నుంచి 21వ తేదీ వరకు కొనసాగనుంది. 6 రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో కస్టమర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ సేల్‌లో భాగంగా ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఉన్నాయి. వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను మీరు తక్కువ ధరకే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్ (vivo T1X Gravity Black, 128 GB, 6 GB RAM) అసలు ధర రూ. 18,990గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ‘గ్రాండ్ ఫెస్టివల్ సేల్’ 2023 సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 21 శాతం తగ్గింపు ఉంది. దాంతో మీరు వివో టీ1ఎక్స్ ఫోన్‌ను రూ. 14,999కి సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు రూ. 3,991 ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో మరింత తక్కువకు మీరు వివో టీ1ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.
Also Read: Redmi A2 Amazon Offres: అమెజాన్‌లో అదిరే ఆఫర్.. రూ. 6499కే రెడ్‌మీ ఏ2 స్మార్ట్‌ఫోన్!
వివో టీ1ఎక్స్ ఫోన్ 6.58 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. 1080 x 2408 పిక్సెల్‌ల రిజల్యూషన్, 401ppi పిక్సెల్ డెన్సిటీతో డిస్‌ప్లే అద్భుతంగా ఉంది. ఈ డిస్‌ప్లేలో 90 Hz రిఫ్రెష్ రేటు, వాటర్‌డ్రాప్ నాచ్ ఉంది. 50MP బ్యాక్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 680 CPU ఉంటుంది. ఇన్‌బిల్ట్ ప్రాసెసర్‌లో అడ్రినో 610 GPU, ఆక్టా-కోర్ CPU ఉన్నాయి. వివో టీ1ఎక్స్ 5000mAh బ్యాటరీతో వస్తుంది.