Purchase SONY Bravia A8F 55 inch OLED Ultra HD TV Just Rs 1,64,999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికపుడు సరికొత్త సేల్స్ తెస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్’ను తీసుకొచ్చింది. జులై 27న మొదలైన ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. జూలై 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్స్ లాంటి పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కొన్నింటిపై అయితే ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు ఇచ్చింది. ఇక సోనీ స్మార్ట్‌టీవీలపై కూడా భారీ తగ్గింపు ఉంది.
ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ 2023 (Flipkart Electronics Sale 2023)లో భాగంగా సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ (SONY Bravia A8F 55 inch OLED Ultra HD 4K Smart Android TV)పై ఏకంగా 49 శాతం ఆఫర్ ఉంది. సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ అసలు ధర రూ. 3,29,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌టీవీపై 49 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించింది. దాంతో ఈ స్మార్ట్‌టీవీని మీరు రూ. 1,64,999కి సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు రూ. 1,64,901 ఆదా చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుపై ఆఫర్ ఉంది. దాంతో సోనీ బ్రావియా 55 ఇంచ్ స్మార్ట్‌టీవీ ధర మరింత తగ్గనుంది.
Also Read: Home Vastu Tips: ఈ మొక్కలు ఇంట్లో అస్సలు పెంచకూడదు.. డబ్బు రాకను అడ్డుకుంటాయి!
సోనీ 55 ఇంచ్ ఎల్‌ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ (SONY 55 inch Ultra HD 4K LED Smart Google TV) అసలు ధర రూ. 99,900. ఈ టీవీపై ఫ్లిప్‌కార్ట్ 41 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దాంతో మీరు సోనీ 55 ఇంచ్ టీవీని రూ. 41,910 తగ్గింపుతో రూ. 57,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసి అదనంగా రూ.3 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా రూ. 11 వేల వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత టీవీని ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు. ఈ ఆఫర్ వర్తిస్తే.. రూ. 46 వేలకే ఈ టీవీని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.
ఈ రెండు మాత్రమే కాకుండా చాలా సోనీ స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపును ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. SONY 125.7 cm (50 inch) Ultra HD (4K) LED Smart Google TVపై 26 శాతం తగ్గింపు ఉండగా.. SONY X82L 138.8 cm (55 inch) Ultra HD (4K) LED Smart Google TV పై 34 శాతం ఆఫర్ ఉంది. సోనీ స్మార్ట్‌టీవీలను కొనాలనుకునే వారు ఈ రోజే కొనేసుకుంటే బెటర్. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ నేటితో ముగియనుంది.
Also Read: David Warner Record: ప్రపంచ రికార్డు నెలకొల్పిన డేవిడ్ వార్నర్!