సోనూసూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వెండి తెర పై ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు.. కరోనా మహమ్మారి కారణంగా దేశమంతటా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసారు సోనూసూద్.ఇప్పటికీ కూడా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సోనూసూద్. అలాగే చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు ఆయన.కొన్ని రోజుల కు ముందు బిహార్‌లోని అనాథ, పేద పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్‌ను కూడా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇలా సినిమాలు నటిస్తూనే తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు సోనూసూద్. సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నారు సోనూసూద్.ప్రస్తుతం ఆయన ఎంటీవీ రోడీస్ సీజన్ 19 షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నారు..
ఇదే షో లో బాలీవుడ్ హీరోయిన్ మరియు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తి కూడా నటిస్తుంది.ప్రస్తుతం ఈ టీవీ షో షూటింగ్ హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్నట్లు సమాచారం.. ఈక్రమంలో సెట్‌లో ఉన్న వారందరి కోసం ఆయన సరదాగా దోసెలు వేశారు. ఎవరికి ఎలాంటి దోసెలు కావాలో అడిగి మరీ వేశారు సోనూసూద్.ఇదే సమయంలో హీరోయిన్ రియా కూడా అక్కడకు వచ్చింది. దీంతో ఆమె కోసం కూడా ఆయన దోసెలు రెడీ చేసి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సోనూ సూద్ సింప్లిసిటీని చూసి ఆయన అభిమానులు ఎంతో ఫిదా అవుతున్నారు కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ మాత్రం సోనూ భాయ్ రియాకు మీరు కొద్దిగా దూరంగా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. కాగా సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో రియాపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఆరోపణల తో ఆమె జైలుకు కూడా వెళ్లారు.దీని కారణంగా సుశాంత్ ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది