Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
Read Also: Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్లో ప్రయాణికులు ఫైర్ !
బీజేపీ, ఆర్ఎస్ఎస్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. దేశ స్వాతంత్ర్యంలో కానీ, రాజ్యాంగ రచనలో కానీ పాత్ర లేని శక్తులు నెహ్రూపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. వీరి భావజాలం ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టించిందని, చివరకు మహాత్మా గాంధీ హత్యకు దారితీసిందని, నేటికి గాంధీ హంతకులను కీర్తిస్తున్నారని, ఇది మతతత్వ దృక్పథం కలిగిన భావజాలం అని అన్నారు.
నెహ్రూ జీవితాన్ని పరిశీలించడం, విమర్శించడం సహజమేనని, కానీ ఆయన మాటలు, రచనలు, వారసత్వాన్ని తారుమారు చేసి, చెడగొట్టే ప్రయత్నం జరుగుతుండటం అసహ్యకరమని సోనియా అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల మాట్లాడుతూ.. బాబ్రీ మసీదు నిర్మాణానికి నెహ్రూ ప్రజాధనాన్ని వాడేందుకు సిద్ధమయ్యారని, అయితే సర్దార్ పటేల్ అడ్డు చెప్పారని అన్నారు. రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల తర్వాత సోనియా గాంధీ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.