Sonali Bendre Birthday Special: అందం – ధైర్యం కలిస్తే… సోనాలీ బింద్రే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonali Bendre Birthday Special: దాదాపు ఇరవై ఎనిమిదేళ్ళ క్రితం నాజూగ్గా, పొడుగు కాళ్ళతో లేలేత అందాలతో చూపరుల కన్నులు మిరమిట్లు గొలిపేలా సోనాలీ బింద్రే సందడి చేశారు. అప్పట్లో అనేక కమర్షియల్స్ లో సోనాలీ సోయగాలు కుర్రకారుకు బంధాలు వేశాయి. వాటిని మరింత గట్టిగా బిగించేస్తూ సినిమాల్లోనూ మురిపించి, జనాన్ని మైమరిపించేలా చేశారు సోనాలీ. తెలుగు చిత్రాల్లోనూ వెలుగులు విరజిమ్మిన సోనాలీ నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారిని ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న విధానం ఎంతోమంది రోగగ్రస్థుల్లో స్థైర్యం నింపింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను పోషించడానికి సిద్ధంగా ఉన్నారు సోనాలి. 2022లో సోనాలీ ‘లవ్ యూ హమేషా’ చిత్రంతో జనం ముందు నిలిచారు.
సోనాలీ బింద్రే మహారాష్ట్ర కుటుంబంలో 1975 జనవరి 1న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ సర్వెంట్. దాంతో పలు రాష్ట్రాల్లో ఆయన పనిచేశారు. బొంబాయిలో కొంతకాలం చదివిన సోనాలీ, తరువాత బెంగళూరు కేంద్రీయ విద్యాలయలో విద్యనభ్యసించారు. చదువుకొనే రోజుల్లోనే ఆమె మనసు మోడలింగ్ పైకి మళ్ళింది. తరువాత సినిమా రంగం నాజూకు షోకుల సోనాలీ బింద్రేను ఆహ్వానించింది. తొలి చిత్రం ‘ఆగ్’లోనే నటిగా తనదైన బాణీ పలికించి ఫిలిమ్ ఫేర్ అవార్డు పట్టేశారు సోనాలీ. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ లో “హమ్మా హమ్మా…” పాటలో సోనాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలచి, జనం మదిని కొల్లగొట్టారు. ఆ తరువాత తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలనే తపించారు సోనాలీ బింద్రే.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
తెలుగులో సోనాలీ బింద్రే నాయికగా నటించిన తొలి చిత్రం కృష్ణవంశీ ‘మురారి’. ఇందులో ఆమె పోషించిన వసుంధర పాత్ర యువతను భలేగా ఆకట్టుకుంది. పాటల్లో సోనాలీ అందాన్ని కృష్ణవంశీ చిత్రీకరించిన తీరు సినీజనాన్నీ మురిపించింది. దాంతో చిరంజీవి ‘ఇంద్ర’ లోనూ సోనాలీ అందం మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాలీ చిందేసిన తీరు కూడా ఆకట్టుకుంది. ఆపై మరోమారు కృష్ణవంశీ తన ‘ఖడ్గం’లో సోనాలీ బింద్రేను ఓ ప్రత్యేక పాత్రలో నటింప చేశారు. అందులోనూ పాటల్లో సోనాలీ సొగసు పరవశింప చేసింది. ఇక నాగార్జున సరసన నాయికగా నటించిన ‘మన్మథుడు’ లో సోనాలీ సోయగాలు మరింతగా ఆకట్టుకున్నాయి. బాలకృష్ణ సరసన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’లో సోనాలీ ఓ నాయికగా నటించారు. మరోమారు చిరంజీవితో ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్.’ లో జోడీకట్టి ఢీడిక్కిలాడించింది సోనాలీ సోయగం.
Tholi Prema Movie: ప్రేమికుల రోజున పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’!
వెండితెరపై సోనాలీ నాజూకు సోకులు చూసి ఫిదా అయిన జనాన్ని బుల్లితెరపైనా మురిపించారు. అనేక టీవీ షోస్ కు వ్యాఖ్యాతగా, న్యాయనిర్ణేతగా వ్యవహరించి అలరించారు. దర్శకనిర్మాత, రచయిత గోల్డీ బెహెల్ ను పెళ్ళాడారు బింద్రే. వారికి ఓ అబ్బాయి. పేరు రణవీర్. అందంగా, ఆనందంగా సాగుతున్న సోనాలీ జీవితంలో క్యాన్సర్ కల్లోలం రేపింది. ధైర్యంగా ఆ వ్యాధిని జయించారు. ఇప్పటికీ సోనాలీ బింద్రే పేరు వినగానే ఆ నాటి ఆమె నాజూకు సోకులే మన మదిలో మెదలుతాయి. నటిగా ఎందరికో స్ఫూర్తి కలిగించిన సోనాలీ, వ్యక్తిగానూ పలువురిలో ధైర్యం నింపారు. సోనాలీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ తనకు నచ్చిన పాత్రల్లో జనాన్ని మెప్పిస్తారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!