Snakes in Pants: సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా వణుకు పుట్టడం ఖాయం. పొరపాటున అవి మన కాళ్లలోకి వచ్చాయంటే చాలు ముందు వెనుక చూడకుండా పరుగులెడుతుంటాం. అయితే కొందరు డబ్బు సంపాదించేందుకు పాములను వేరే దేశాలకు అక్రమంగా తరలిస్తుంటారు. అలాంటి క్రమంలో వారి అదృష్టం బాగుంటే పర్లేదు. లేకుంటే జైలు గొడల మధ్య జీవితాన్ని గడపాల్సిందే. తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి సంఘటనే ఎదురైంది. పాములను తన ప్యాంటులో దాచిపెట్టి స్మగ్లింగ్ చేసినట్లు అమెరికా చెందిన ఓ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి.
కెనడా నుంచి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసినట్లు అమెరికాకు చెందిన కాల్విన్ బౌటిస్టా అనే వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. పాములను యూఎస్-కెనడియన్ సరిహద్దు గుండా అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఆ వ్యక్తి తన ప్యాంటులో వాటిని దాచుకున్నాడని సమాచారం. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం,.. కాల్విన్ బౌటిస్టా, 36, జూలై 15, 2018న ఉత్తర న్యూయార్క్‌కు చేరుకున్న బస్సులో పాములను దాచిపెట్టాడు.బర్మీస్ పైథాన్‌ల దిగుమతి అంతర్జాతీయ ఒప్పందం, సమాఖ్య చట్టం ద్వారా నియంత్రించబడినందున న్యూయార్క్‌కు చెందిన ఆ వ్యక్తి నేరానికి సంబంధించి ఫెడరల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బర్మీస్ పైథాన్‌లు మానవులకు హానికరమైనవిగా జాబితా చేయబడ్డాయి.
Uttar pradesh : యూపీలో అమానుషం.. 36ఏళ్లుగా కూతురుని గదిలో బంధించిన తండ్రి
ఫెడరల్ స్మగ్లింగ్ ఆరోపణలపై బటిస్టా ఈ వారం న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీలోని కోర్టులో ప్రవేశపెట్టబడ్డాడు. అనంతరం విచారణ పెండింగ్‌లో ఉంచి విడుదల చేశారు. బర్మీస్ పైథాన్ ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి. హాని కలిగించే జాతిగా పరిగణించబడుతుంది. కెనడా నుంచి మూడు బర్మీస్ కొండచిలువలను స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాల్విన్ బటిస్టా, నేరం రుజువైతే గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 250,000 డాలర్ల జరిమానా విధించబడుతుంది.