మనలో చాలామంది పాము కనబడితే చాలు భయభ్రాంతులకు లోనవుతాము. అలాగే పాములు కూడా మనుషులను చూసినప్పుడు కూడా అలాగే భయపడిపోతాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం పాములను పెంపుడు జంతువుల లాగా పెంచుకోవడం మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. మరికొంతమంది పాములను పట్టుకుని వాటితో వ్యాపారాలు చేయడం.. వాటిని సంత మార్కెట్ లలో పెట్టి అమ్మడం లాంటి పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే పాములను పట్టుకుని వాటితో జీవనోపాధి గడిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే..
also read: Viral Video: శివ శివ.. అంటూ శివునికే నామం పెట్టిన దొంగ..!
తాజాగా మధ్యప్రదేశ్‌లోని బేతుల్ లో పాముకు సంబంధించిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాంతంలో పాముని పట్టుకుని ఆడిస్తున్న ఒక మహిళ తన స్వలాభం కోసం ఫెవిక్విక్ తో నాగుపాము నోటిని అంటించింది. పాముని బుట్టలో పెట్టుకుని తిరుగుతూ అడుక్కోవడం ఆమె చేసే పని. ఇలాంటి అపస్మారక స్థితిలో ఉన్న పాములను వారి వద్ద ఉన్న బుట్టలలో పెట్టుకుని తిరుగుతూ.. వాటి ద్వారా డబ్బు సంపాదించడం చేస్తుంది. డబ్బు కోసం పాములను నానా హింస పెడుతుండడం చూస్తూనే ఉంటాము.
also read: Viral: అయ్యయో.. తల్లి, పిల్లాడు రైలు ఎక్కుతుండగా షాకింగ్ ట్విస్ట్.. చివరికి..?!
ఇకపోతే బేతుల్ జిల్లా పరిధిలో ఉన్న భైందేహిలో పాములను ఆడించే ఓ మహిళ సుమారు 5 అడుగుల పొడవు గల నాగుపాముతో తిరిగుతున్నట్లు దగ్గరలోని పాము నిపుణుడికి సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పాముల నిపుణుడు శివ నర్వారే ఆమె వద్దకు చేరుకున్నాడు. డాక్టర్ ఆమెను ప్రశ్నించడంతో ఆ మహిళ అక్కడ నుంచి పారి పోయింది. ఈ హడావిడిలో నాగు పాముని అక్కడే వదిలి వెళ్ళింది. ఆ పామును చుసిన డాక్టర్ నాగుపాము పరిస్థితి బాగాలేదని.. పాము తీవ్రంగా గాయపడ్డమే కాక పాము నోరు కూడా అతుక్కుని ఉందని తెలిపాడు. దీనితో పాము నోరు తెరవలేకపోయింది. వైద్యుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా పామును వెటర్నరీ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ నాగుపామును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చికిత్స అందించారు. వైద్యశాలలో చేసిన పరీక్షలో పాము నోటిని ఫెవిక్విక్ తో నిర్ధారణ అయ్యింది.