మనదేశంలో అధికంగా పండిస్తున్న తీగజాతి కూరగాయలల్లో పొట్టి పొట్లకాయ కూడా ఒకటి..దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.. ఈ పొట్టి పొట్లకాయ పచ్చడి, ఫ్రై , పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల పొట్లకాయలున్న చారాల ఉన్నవి, లేనివి ఆకుపచ్చ పొట్లకాయను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుత్తం కూరగాయల మార్కెట్లో చిట్టి పొట్లకాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది..
ఈ పొట్లకాయ పంటకాలం 120-130 రోజులు ఉంటుంది. ఎకరానికి 600-800 విత్తనం అవసరమవుతుంది.. వీటిని విత్తే ముందే విత్తన శుద్ధి చెయ్యడం చాలా మంచిది.. ఇలా చెయ్యడం వల్ల తెగుళ్ల బారిన పడకుండా ఉంటాయి.. మే రెండో వారంలో విత్తుకోవచ్చు. అంతే కాకుండా శాశ్వత పందిళ్లపై వేయడం ద్వారా తెగుళ్లును అరికట్టవచ్చు. దిగుబడి ఎక్కువ రావడానికి పందిరి చాలా దోహదపడుతుంది. రెండు మూడు రోజులకు నీటి తడులను అందిస్తూ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎకరాకు 15 టన్నుల పొట్లకాయల దిగుబడిని పొందవచ్చు..
ఇకపోతే ఈ పంటసాగుకు నేలను నాలుగు, ఐదు సార్లు దుక్కి దున్నాలి. ఎకరానికి 8-10 టన్నుల ఎరువు వేసి కలియ దున్నాలి. విత్తనం వేసే ముందు సేంద్రియ ఎరువులను తయారుచేసుకోవాలి. ఇలా చేయడం వల్లన దిగుబడి ఎకరానికి 12 నుంచి 15 టన్నులు వస్తాయి. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. సరైన పద్ధతులు పాటిస్తూ వాటిని పండిస్తే అధిక లాభాలను పొందవచ్చు.. ఎకరానికి ఎలా లేదనుకున్న ఓ 2- 3 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు.. నాలుగు వైపుల డ్రిప్ ను ఏర్పాటు చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ అద్బుతమైన లాభాలను పొందవచ్చు. ఈ పంటకు శాశ్వత పందిర్ల ద్వారా సంవత్సరమంతా అనగా 365 రోజులు దిగుబడులను తీయవచ్చు.. అంతర పంటలు కూడా వేసుకోవచ్చు.. మొత్తంగా చూసుకుంటే లాభాలే అధికంగా ఉన్నాయి..