Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ 2026లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రూప్-ఎ లో భాగంగా గురువారం జరిగిన ఈ పోరులో మంధాన విజృంభించి కేవలం 57 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తంగా ఆమె 124 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రత్యర్థి హాంకాంగ్ బౌలర్లలో మెరీనా లాంప్లో రెండు వికెట్లు తీసి కాస్త మెరుగ్గా రాణించినప్పటికీ, మంధాన విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయారు.
ఈ సెంచరీ ఇన్నింగ్స్ సాధించే క్రమంలో స్మృతి మంధాన అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత్‌కే చెందిన దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును ఆమె అధిగమించారు. మిథాలీ రాజ్ తన కెరీర్లో 333 మ్యాచ్‌ల్లో 10,868 పరుగులు చేయగా, మంధాన కేవలం 302 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే 10,880 పరుగులు సాధించి అగ్రస్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ 370 మ్యాచ్‌ల్లో 10,740 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు.
Also Read
అంతేకాకుండా.. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున రెండు శతకాలు బాదిన తొలి మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన సరికొత్త మైలురాయిని అందుకున్నారు. గతంలో 2025లో ఇంగ్లాండ్‌పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా 112 పరుగులు చేసి తన మొదటి టీ20 సెంచరీ నమోదు చేసిన ఆమె, ఇప్పుడు హాంకాంగ్‌పై రెండో సెంచరీ సాధించారు. గతంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2018లో న్యూజిలాండ్‌పై 103 పరుగులు చేసి భారత్ తరఫున తొలి టీ20 శతకం నమోదు చేసిన విషయం తెలిసిందే. మంధాన స్థిరమైన ఫామ్, వరుస రికార్డులతో భారత మహిళా క్రికెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకున్నారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!