Smriti Mandhana Wedding: చివరి నిమిషంలో స్మృతి మందాన-పలాష్ పెళ్లి క్యాన్సిల్.. కథలో కొత్త ట్విస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana Wedding: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె ఆటతీరు కారణంగా కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాల వల్ల. గత ఏడాది సంగీత దర్శకుడు పలస్ ముచ్చల్ తో ఆమె పెళ్లి చివరి నిమిషంలో రద్దవడం పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. 2025 నవంబర్ 23న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత కూడా పెళ్లిని రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొదటగా మందాన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని కారణం చెబుతూ పెళ్లి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
అయితే సోషల్ మీడియాలో మాత్రం పలు వదంతులు చక్కర్లు కొట్టాయి. పలాష్ ముచ్ఛల్ మందానను మోసం చేశాడనే ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగానే మందాన ఈ పెళ్లిని ధైర్యంగా రద్దు చేసుకుందని ప్రచారం జరిగింది. చివరికి ఇరు కుటుంబాలు తమ సంబంధం ముగిసిందని అధికారికంగా ప్రకటించడంతో ఈ కథకు ముగింపు పడింది. ఇక తాజాగా మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. మంధాన తండ్రి శ్రీనివాస్, పలాష్ సోదరి పలక్ ముచ్చల్ కుటుంబంతో కలిసి స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో పలక్, మందాన తండ్రి పాదాలకు నమస్కారం చేయడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. దీంతో మళ్లీ ఇరు కుటుంబాలు కలిసే అవకాశముందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
Israel Attacks: 10 నిమిషాల్లోనే అంతా బూడిద.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఇజ్రాయెల్..
కానీ తాజా సమాచారం ప్రకారం, మందాన-పలాష్ మళ్లీ కలిసే అవకాశం లేదని స్పష్టమైంది. ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోయారని, తిరిగి సంబంధం కొనసాగించే పరిస్థితి లేదని వెల్లడైంది. కుటుంబాల మధ్య ఈ కలయిక కేవలం పరస్పర గౌరవంతో జరిగిన సాధారణ సమావేశమేనని సమాచారం. పలాష్ ముచ్ఛల్ విషయానికి వస్తే.. అతను బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘డిష్కియావూన్’, ‘భూత్‌నాథ్ రిటర్న్స్’ వంటి సినిమాలకు సంగీతం అందించారు. తర్వాత ‘అర్ధ్’ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారారు. అలాగే ఆయన సోదరి పలక్ ముచ్ఛల్, బావ మిథూన్ కూడా ప్రముఖ గాయకులు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!