Smriti Mandhana Boyfriend: బాయ్ ఫ్రెండ్‌తో స్మృతి మంధాన.. ఫొటోస్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana Photo With Boyfriend Palash Muchhal in WPL 2024 Final: డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్‌లో గత 16 ఏళ్లుగా పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. మహిళల జట్టు మాత్రం రెండో సీజన్‍లోనే సాధించింది. ఆర్‌సీబీకి తొలి టైటిల్ దక్కడంతో.. బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు.
డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవగానే ప్లేయర్స్ అందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా మైదానంలో సందడి చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆర్‌సీబీకి సపోర్ట్ చేసిన పలాష్.. గెలిచాక స్మృతి, ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్‌సీబీ మాజీ ఆటగాడు యుజ్వేంద్ర చహల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలాష్ ఫోటోను షేర్ చేయడం విశేషం.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: WPL Final-Virat Kohli: స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్.. ఏమన్నాడంటే?
2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచినప్పుడు కూడా పలాష్ ముచ్చల్.. స్మృతి మంధానతో కలిసి ఫొటోస్ దిగాడు. డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం కూడా ఇద్దరు ఫొటోస్ దిగారు. గత కొంత కాలంగా స్మృతి, పలాష్ డేటింగ్‌లో ఉన్నారట. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన పలాష్‌కు.. ఓ ఈవెంట్‌లో స్మృతితో పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం.
Smriti Mandhana with
Palash Muchhal (BF) 😍❤️ pic.twitter.com/InJyiRoIyv— Lokesh Saini🚩 (@LokeshVirat18K) March 17, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!