Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smoking While Drinking Tea: ఉదయం లేవగానే లేదా ఏదో ఒక సమయంలో ఒక కప్పు టీతో పాటు సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొందరికి ఇది రిలాక్సేషన్‌గా అనిపించినా.. ఆరోగ్య నిపుణులు మాత్రం ఈ కాంబినేషన్‌ను ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వేడి టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఓ ప్రముఖ పరిశోధన నివేదిక ప్రకారం.. వేడి టీ తాగుతూ సిగరెట్ కాల్చే వారిలో పలు రకాల క్యాన్సర్లు సహా తీవ్రమైన వ్యాధుల ముప్పు గణనీయంగా పెరుగుతుంది. వేడి పానీయాలు గొంతు, ఆహారనాళంలోని కణజాలాన్ని దెబ్బతీయగా.. సిగరెట్ లోని కార్సినోజెనిక్ రసాయనాలు ఆ నష్టాన్ని మరింత పెంచుతాయి. మరి దీని వల్ల శరీరానికి ఎలాంటి నష్టమో చూసేద్దామా..
Also Read
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
- Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
- Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
ఊపిరితిత్తుల క్యాన్సర్:
సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు వేడి టీ కారణంగా శ్వాసనాళాల్లో చికాకు, వాపు పెరిగి కణజాల నష్టం మరింత అధికమవుతుంది. ఇది దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలను మరింతంగా పెంచుతుంది.
ఆహారనాళ క్యాన్సర్:
వేడి టీ తరచూ తాగడం వల్ల ఆహారనాళం లోపలి పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే సిగరెట్ పొగలో ఉండే విషపూరిత రసాయనాలు కణాలపై ప్రభావం చూపుతాయి. ఈ రెండు కలిసి ఆహారనాళ క్యాన్సర్ ప్రమాదాన్ని మరింత పెంచుతాయి.
గొంతు క్యాన్సర్:
గొంతు భాగం వేడి పానీయాలు, పొగ రెండింటికీ సున్నితంగా స్పందిస్తుంది. సిగరెట్ లోని ఫార్మాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికర రసాయనాలు గొంతు కణజాలాన్ని దెబ్బతీస్తాయి. వేడి టీతో కలిసి ఇవి గొంతులో దీర్ఘకాలిక వాపు, స్వరంలో మార్పులు, చివరికి గొంతు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
గుండె జబ్బులు:
సిగరెట్ లోని నికోటిన్ గుండె స్పందన వేగాన్ని, రక్తపోటును పెంచుతుంది. టీలో ఉండే కెఫీన్ కూడా అధికంగా తీసుకుంటే గుండెపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈ రెండింటి ప్రభావంతో రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు, ఇతర గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం అధికమవుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం:
నికోటిన్, కెఫీన్ రెండూ రక్తనాళాలను కుదించడంలో పాత్ర పోషిస్తాయి. దీంతో రక్తపోటు పెరగడమే కాకుండా రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా అధికమవుతుంది. ముఖ్యంగా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా హైబీపీ ఉన్నవారిలో స్ట్రోక్ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.
సంతానోత్పత్తి సమస్యలు:
ధూమపానం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను తగ్గించవచ్చు. మహిళల్లో కూడా పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కెఫీన్ అధికంగా తీసుకోవడం కూడా ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జ్ఞాపకశక్తి తగ్గుదల:
సిగరెట్ తాగడం వల్ల మెదడుకు వెళ్లే రక్తప్రసరణ క్రమంగా తగ్గుతుంది. అధికంగా టీ తాగడం వల్ల తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు రావచ్చు. దీర్ఘకాలంలో ఈ అలవాటు జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలకు దారితీయవచ్చు.
కడుపులో పుండ్లు:
టీ కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతుంది. మరోవైపు నికోటిన్ కడుపు లోపలి రక్షణ పొరను బలహీనపరుస్తుంది. ఈ కారణంగా కడుపులో పుండ్లు, అజీర్ణం, మంట, వికారం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
నిపుణుల సూచన..
టీ, సిగరెట్ రెండూ చాలా మంది జీవితంలో భాగమైపోయినప్పటికీ.. ఈ రెండింటిని ఒకేసారి తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. దీనికి పరిష్కారం ధూమపానాన్ని పూర్తిగా మానేయడం ఉత్తమం. అది సాధ్యం కాకపోతే కనీసం టీ తాగే సమయంలో సిగరెట్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అతిగా వేడిగా ఉన్న పానీయాల బదులుగా గోరువెచ్చని పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!