ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్కంద’.మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాను శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియో రెండు పాపులర్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. చిత్రం విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. సినిమా నుంచి మాస్ గ్లింప్స్ విడుదలైంది. ఆ మాస్ గ్లింప్స్ లో హీరో రామ్ పోతినేని బోయపాటి మార్క్ డైలాగ్స్ తో అదరగొట్టాడు.
అలాగే ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంది విడుదల అయిన రెండుపాటలకు మాసీవ్ రెస్పాన్స్ ను వస్తుంది.. అలాగే రామ్ పోతినేని, శ్రీలీలా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అలాగే వీరిద్దరూ కలిసి మాస్ స్టెప్స్ తో అదరగొడుతున్నారు. ఇలా ఈ సినిమా నుంచి వస్తున్న వరుస అప్డేట్స్ సినిమాపై భారీగా హైప్ ని పెంచేస్తున్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ థండర్ పేరిట ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.’స్కంద’ ట్రైలర్ లాంఛ్ కు నందమూరి నటసింహం ముఖ్య అతిథిగా రాబోతున్నారు . బాలయ్య చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 26 (రేపు) సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ లోనిశిల్పా కళావేదికలో నిర్వహించనున్నట్టు తెలిపారు. దీంతో రాపో అభిమానులు ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.