ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్కంద”..యంగ్ హీరో రామ్ తో పక్కా మాస్ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు బోయపాటి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా వుంది.
ఈ సినిమాతో హీరో రామ్ మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకోవాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే బోయపాటి అంటేనే ఊర మాస్ దర్శకుడు అని పేరు వుంది.. మరి అలాంటి బోయపాటి యంగ్ హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు అని తెలియగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీ గా పెరిగిపోయాయి.
ఈ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత గా పెంచేసింది.. ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ ను విడుదల చేసారు. రెండు సాంగ్స్ లో కూడా హీరో రామ్ మరియు హీరోయిన్ శ్రీ లీల అదిరిపోయే స్టెప్స్ తో ఎంతగానో అలరించారు… ప్రస్తుతం ఆ సాంగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ట్రైలర్ ను ఈ నెల 26న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయని సమాచారం.. మరి ఈ సినిమా ట్రైలర్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి..