ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో మేజర్ మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ మరియు దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు .. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందే ట్రైలర్ మరియు పాటలతోనే భారీ హైప్ సంపాదించుకుంది. సెప్టెంబర్ 28 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.ఈ ఆ తర్వాత వరుసగా రెండు మూడు రోజులు భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గిపోతూ వచ్చాయి..
ఈ మూవీలో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రామ్ అద్భుతంగా నటించి మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన నాలుగు వారాలకు అంటే అక్టోబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం . అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.