గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసుకొనే పనిలో ఉన్నారు.. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు పూర్తి కావొస్తుంది.. ఇప్పటికి విడుదలకు నోచుకోలేదని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఇక నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి..’ అంటూ సాగే మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని అనంత్ శ్రీరామ్ రాయగా థమన్ సంగీతాన్ని అందించగా, మెహెన్ది, సునిధి చౌహన్ పాట పాడారు.. హీరో ప్రభుదేవా మాస్టర్ సాంగ్ ను కంపోజ్ చేశారు.. ఈ సాంగ్ మంచి వ్యూస్ ను రాబట్టింది కానీ సాంగ్ అర్థం కాలేదనే టాక్ ను అందుకుంది.. బీట్ ఊపును ఇస్తుంది. సాంగ్ క్లారిటీ లేకపోవడంతో విమర్శలు అందుకుంటుంది..
ఇప్పుడు మరోసారి సాంగ్ లోని రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్స్ పై దారుణమైన ట్రోల్స్ ను చేస్తున్నారు.. బ్లూ కలర్ డ్రెస్స్ పై కియారా ఫోటోలను ప్రింట్ చేశారు.. అది గమనించిన నెటిజన్స్ ఓ రేంజులో ఆడుకుంటున్నారు.. డ్రెస్ పై కామెంట్స్ చేస్తూ.. ఇదేమి క్రియేటివిటీ అంటూ పలువురు విమర్శలు చేస్తుంటే, కొందరు మాత్రం కొత్తగా ఉంది అంటూ పొగుడుతున్నారు.. ఏది ఏమైన ఈ డ్రెస్సు పై సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి..