Sivakarthikeyan: చెన్నై సెంట్రల్ పరిధిలోని కైలాష్ నగర్ ప్రాంతంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్ జామ్‌లో ఉన్న హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
READ ALSO: Off The Record: ఏపీ మంత్రి గుమ్మడి సంద్యారాణికి సొంత ప్రాంతంలో చెక్ పడబోతోందా?
అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్‌తో పాటు ఆయన కారులో ఉన్నవారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. అయితే ప్రమాదం కారణంగా కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ప్రమాదం తీవ్రత తగ్గిందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటనతో ముందుగా హీరో శివకార్తికేయన్ అభిమానులు ఆందోళనకు గురైనా, తర్వాత హీరో పూర్తిగా క్షేమంగా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.
READ ALSO: Off The Record: BRSకు ఇప్పుడు మరో విడత జంపింగ్స్ భయం పట్టుకుందా? | సన్మానాల పేరుతో బుజ్జగింపు..