Ponniyin Selvan: కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న భారీ పీరియాడికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎట్టకేలకు ఆడియన్స్ ముందు నిలపబోతున్నారు మణిరత్నం. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాల, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాశ్ రాజ్, పార్తిపన్ కీలక పాత్రలు పోషించారు. రెండుభాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి భాగం తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకును నిర్వహించింది యూనిట్. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకను నిర్వహించిన తీరు అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. హాజరైన టాప్ ఆర్టిస్ట్ లు, సాంకేతికనిపుణులు సరైన సమయానికి హాజరు కావటంతో పాటు నిర్ణయించిన టైమ్ కి ఎలాంటి సోత్కర్షలు లేకుండా ఆరంభించటం, ముగించటంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే కొద్దిలో కొద్దిగా వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన వారు అతి చేశారన్న వాదన అయితే ఉందనుకోండి. సినిమా విడుదలలో బిజీగా ఉన్న మణిరత్నం తరపున ఆయన భార్య సుహాసిని హాజరైన ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ మాత్రం ఏ.ఆర్. రెహామాన్. ఈ వేడుకకు హాజరైన పలువురు మన హీరోల సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో జరిగే హడావుడిని పోల్చి చూస్తున్నారు. ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న హీరోలు కూడా తాపీగా ఎంత లేటుగా వస్తే అంత గుర్తింపు అన్నట్లు ప్రవర్తించే తీరును గుర్తు చేస్తున్నారు. ఇక ఈ వేడుకలలో నానా రకాల ఏవీలు వేస్తూ చిల్లర డాన్స్ లు చేస్తూ టైమ్ అంతా వేస్ట్ చేయటం గత కొంత కాలంగా గమనిస్తూనే ఉన్నాం. అలాంటి హంగామాని పక్కన పెట్టి ఈవెంట్ ని అనుకున్న టైమ్ లో ఆరంభించి ముగించిన ‘పొన్నియిన్ సెల్వన్’ టీమ్ క్రమశిక్షణను చూసైనా మన వాళ్ళు మారతారని ఆశిద్దాం. అయినా కుక్కతోక వంకర కదా…! జరుగుతుందంటారా!? మీరే చెప్పండి.
Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు