తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన ‘బలగం’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతలా ఎమోషనల్ అయ్యారో మనందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి హృదయాన్ని హత్తుకునే అనుభూతినే అందిస్తోంది ఇటీవల తమిళంలో సంచలనం సృష్టించిన ‘సిరై’ అనే ఓ చిన్న సినిమా. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిలోకి వచ్చేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం…