సింగరేణి కాలరీస్ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ రంగంలోనూ విజయవంతంగా అడుగుపెట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సోలార్ రంగంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగరేణి థర్మల్, సోలార్ విద్యుత్ సమీక్ష సమావేశంలో ఆయన సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సోలార్ రంగంలోకి అడుగుపెట్టి కమర్షియల్…
ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే 4 కొత్త గనులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరి కొన్ని నూతన బొగ్గు బ్లాకుల సాధించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నామని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సింగరేణిలో కొత్త గనులపైనిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పలు అంశాలపై లోతుగా చర్చించారు. నూతన గనులపై తగిన కార్యాచరణతో ముందుకెళ్లాలని, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్ని ఏరియాల జీఎంలను ఆదేశించారు.…
సింగరేణి కాలరీస్ ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీ రోజూ విలువైనదేనని.. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు, రానున్న వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేందుకు వీలుగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, రోజుకు 15 లక్షల…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై సింగరేణి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎఫ్ ఏ సి)గా బాధ్యతలు స్వీకరించిన ఎన్.బలరామ్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించగా.. తగినంత బొగ్గు రవాణాను ఎటువంటి కొరత లేకుండా కొనసాగిస్తామని, అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాల కోసం నిరంతరాయంగా అందజేస్తామని…