CM Revanth Reddy: యశోదలో వెంకట్‌రెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వెంకట్ రెడ్డిని పరామర్శించారు. వెంకట్ రెడ్డి గత కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల మంత్రి కూడా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Read also: BJP: నేడు బీజేపీ కీలక సమావేశాలు.. శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం..!
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన ఆయన గతంలో వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా పదేళ్ల తర్వాత మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నల్గొండ అంటే కోమటిరెడ్డిగా జిల్లాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తాజాగా ఆయన నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత కొంతకాలంగా గొంతు సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒకసారి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అయితే మరోసారి ఇబ్బంది రావడంతో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి వెంకట్ రెడ్డిని పరామర్శించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆస్పత్రికి వచ్చిన మంత్రిని పరామర్శించారు. మంత్రి వెంకట్ రెడ్డి ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లారు.
Rafael Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్!
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!