Simhachalam: సింహాచలం చందనోత్సవంలో అపచారం జరిగింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో ఉన్న స్వామివారి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు గుర్తు తెలియని భక్తులు.. ఓ వైపు వేడుక జరుగుతుండగానే బయటకు వచ్చాయి ఫొటోలు, వీడియోలు.. స్వామివారి అంతరాలయంలో ఫొటోలు, వీడియోలపై నిషేధం ఉన్నా.. ఇలా బయటకు రావడంతో కలకలం రేగుతోంది.. గత ఏడాది తొలిసారి బయటకు వచ్చాయి అప్పన్న అంతరాలయ వీడియోలు.. ఇప్పుడు మరోసారి ఫొటోలు, వీడియోలు బయటకురావడంపై భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై విచారణకు గానీ, బాధ్యులపై చర్యలకు గానీ ఇప్పటి వరకు దేవస్థానం అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట..
Read Also: Harish Rao: బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం మరో చరిత్ర కాబోతోంది..
కాగా, ఈ నెల 23వ తేదీన సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం నిర్వహించారు.. స్వామివారు నిజరూప దర్శనాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.. అయితే వీవీఐపీ దర్శనాల్లో గందరగోళం నెలకొంది. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలతో పాటు సర్వ దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. అయితే టికెట్ల విక్రయాలు, స్లాట్ కేటాయింపులో మాత్రం గందరగోళ పరిస్థితి నెలకొందని భక్తులు ఆరోపణలు గుప్పించిన విషయం విదితమే.. ఓ వైపు వీఐపీలు, మరోవైపు సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో.. సింహాచలం కొండపై ట్రాఫిక్ నిలిచిపోయి భక్తులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.