Siddhu Jonnalagadda’s New Movie Name is Jack: ‘సిద్ధు జొన్నలగడ్డ’ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎల్బీడబ్ల్యూ, దాగుడుమూత దండాకోర్, గుంటూరు టాకీస్, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్ హిస్ లీల, కల్కి లాంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. అయితే ‘డీజే టిల్లు’ సినిమాతో స్టార్ బాయ్ అయ్యాడు. తన నటన, డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో సిద్దూకు యూత్‌లో భారీ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం డీజే టిల్లుకు సీక్వెల్ తెరకెక్కుతోంది.
మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ తన తదుపరి సినిమాను బొమ్మరిల్లు భాస్కర్‌తో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది. నేడు సిద్ధు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. సిద్ధు, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకు ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌లో హీరో గన్స్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read: Vishal Political Entry: ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా.. రాజకీయ ఎంట్రీపై స్పందించిన హీరో విశాల్!
జాక్ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ‘స్టార్ బాయ్’ సిద్ధు జొన్నలగడ్డ సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చుతున్నట్లు సమాచారం. సిద్ధు స్టయిల్లో ఈ సినిమా ఉండనుంది. డీజే టిల్లుకు సీక్వెల్ అనంతరం జాక్ సినిమా విడుదల కానుంది. జాక్ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.