లవర్ బాయ్ గా ఎన్నో మంచి సినిమాల్లో నటించి కొద్ది రోజుల్లోనే యువత లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సిద్ధార్థ్. ఈయన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే బాయ్స్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు సాధించారు..ఆ తర్వాత బొమ్మరిల్లు ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,ఓయ్, చుక్కల్లో చంద్రుడు మరియు ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా అయితే మారిపోయారు. అయితే అలాంటి సిద్ధార్థ్ ఆ తర్వాత అవకాశాలు లేక చాలా రోజులు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. అయితే ఒకానొక సమయంలో ఆయన స్టార్డం వచ్చాక తెలుగు సినిమా ఇండస్ట్రీ పై అణుచిత వ్యాఖ్యలు చేసినందు వల్ల ఆయనకు తెలుగులో అవకాశాలు దక్కలేదు..శర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా వచ్చిన మహాసముద్రం సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ని ఇచ్చారు. కానీ ఈ సినిమా అంత గా ఆకట్టుకోలేదు. దాంతో ప్రస్తుతం ఎలాగైనా హిట్టు కొట్టాలి అనే ఉద్దేశంతో సిద్ధార్థ్ వున్నారు.ఇక సిద్ధార్థ్ తాజాగా నటిస్తున్న సినిమా టక్కర్ . ఈ సినిమా జూన్ 9న విడుదల కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు సిద్ధార్థ్. ఇక ప్రమోషన్స్లో పాల్గొంటూ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకుంటున్నారు. ఇక తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ సంచలన విషయాన్ని కూడా ఆయన బయట పెట్టారు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. నేను గతంలోనే ఎన్నో మంచి సినిమాల్లో నటించాను. అందులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలకు చాలానే నంది అవార్డులు కూడా వచ్చాయి.నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి ఏకంగా 15 నంది అవార్డులను మూవీ యూనిట్ వాళ్ళు వివిధ కేటగిరీల్లో అయితే అందుకున్నారు. అలాగే బొమ్మరిల్లు సినిమాకు కూడా 11 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఈ రెండు సినిమాలకు అన్నేసి అవార్డులు వచ్చాయి కానీ అందులో నాకు ఏ ఒక్క అవార్డు కూడా రాలేదు. అయితే నా నటన బాగుంది కానీ కొంతమంది కావాలనే నాకు అవార్డులను రాకుండా నన్ను తొక్కేశారు. అయితే అలాంటి టైం లో నాకు ఎంతో బాధేసింది.సినిమాలో ఇంత మందికి అవార్డులు వస్తాయి నాకు ఒక్కడికే ఎందుకు రాలేదు అని ఆలోచించాను కానీ అవన్నీ నేను ఏమీ పట్టించుకోలేదు.దానికి ప్రధాన కారణం ఆ సినిమా విడుదల అయినప్పుడు పుట్టని చాలామంది కూడా ఇప్పుడు నన్ను గుర్తుపట్టి మీరు ఆ సినిమాలో బాగా చేశారు సార్ అని పొగడడం నాకు అవార్డు వచ్చే కంటే ఎక్కువ సంతోషాన్ని అయితే ఇచ్చింది. ఇక ఆ టైంలో నాకు అనిపించింది ఇంతకంటే మంచి అవార్డు మరొకటి ఉంటుందా అని.అంటూ సిద్ధార్థ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.