కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ సినీయర్ నాయకులు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పీసీసీ ఆరేళ్లు బహిష్కరణ విధించింది. అయితే.. ఈ నేపథ్యంలో తాజాగా పీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు శ్యామ్ మోహన్ మాట్లాడుతూ.. మర్రి శశిధర్ రెడ్డి పై వేటు తొందర పాటు నిర్ణయమన్నారు. చిన్నారెడ్డి కమిటీ సమావేశం పిలవాల్సి ఉండాల్సిందని, ఎవరో ఒత్తిడితో నిర్ణయం తీసుకోవద్దు కదా.? అని ఆయన అన్నారు. అంత తొందర పాటు ఎందుకని ఆయన ప్రశ్నించారు. పార్టీలో ఆయనకు తగిన గౌరవం దక్కలేదని, 2018 లో టికెట్ ఇవ్వకుండా అవమానం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : America Shooting: అమెరికాలోని నైట్‌క్లబ్‌లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి, 18మందికి గాయాలు
ఇద్దరు ఏఐసీసీ కార్యదర్శులు మాట్లాడి.. అధిష్టానం మాట్లాడుతుంది అన్నారన్నారు. రెండు నెలలుగా అధిష్టానం నుండి పిలుపే లేదని, పార్టీపై శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నో కామెంట్ అన్నారు శ్యామ్ మోహన్. చిన్నారెడ్డి లాంటి కుటుంబం పట్ల పార్టీ ఇలా వ్యవహారం చేయకూడదని, రెండేళ్ల క్రితం అధిష్టానం కో లేఖ రాశామని, పీసీసీ ఎవరికి ఇచ్చినా.. కాంగ్రెస్ లయాలిస్ట్ కి ఇవ్వాలని లేఖ రాశామన్నారు. అధిష్టానం నుండి కూడా ఎలాంటి రిప్లై రాలేదని, పార్టీ లో తమకు అన్యాయం జరిగింది అనే ఆవేదన శశిధర్ రెడ్డి లో ఉందన్నారు. పార్టీలో భవిష్యత్ లేదనే ఫిలింగ్ కి వచ్చారని శ్యామ్ మోహన్ వ్యాఖ్యానించారు. దీంతో శ్యామ్ మోహన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పార్టీలో నాయకుల మధ్య విభేదాలతో తలలు పట్టుకుంటున్న సీనియర్లకు.. ఇప్పుడు మరోసారి ఈ విభేదాల తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.