Shubman Gill miss fielding on IND vs ENG 2nd Test Day 4: విశాఖ వేదికగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆడుతున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ గాయంతో నాలుగో రోజు ఆటకు దూరమయ్యాడు. రెండో రోజు ఆటలోనే అతడి కుడి చేతి వేలికి గాయమైన విషయం తెలిసిందే. గిల్ స్ధానంలో దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. స్లిప్‌లో అద్భుతంగా క్యాచ్‌లు అందుకునే గిల్.. ఫీల్డింగ్‌లో లేకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి.
రెండో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ కుడి చూపుడు వేలికి గాయమైంది. వికెట్స్ పడడంతో వేలి నొప్పి బాధిస్తున్నా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుత సెంచరీ చేశాడు. అయితే వేలి నొప్పి ఎక్కువగా ఉండడంతో.. నాలుగో రోజు ఫీల్డింగ్‌కు గిల్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్‌లో వెల్లడించింది. ‘రెండో రోజు ఫీల్డింగ్‌లో శుభ్‌మన్ గిల్ చేతి వేలికి గాయమైంది. గిల్ నాలుగో రోజు ఫీల్డింగ్‌కు దూరంగా ఉంటాడు’ బీసీసీఐ ట్విట్ చేసింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో గిల్ 104 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లో మూడో టెస్టు సెంచరీ.
Also Read: Rohit Sharma Catch: రోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. ఓలీ పోప్ ఔట్!
కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన శుభ్‌మన్ గిల్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 147 బంతుల్లో 104 పరుగులు చేశాడు. గిల్ పోరాటంతోనే భారత్ 255 పరుగులు చేసింది. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఔటైనా గిల్ జట్టును ఆదుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ (29)తో కలిసి మూడో వికెట్‌కు 81 పరుగులు, అక్షర్ పటేల్ (45)తో కలిసి ఐదవ వికెట్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.