Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
- వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్
- ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ కెప్టెన్ శుభ్‌మన్ గిల్
- మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ గిల్ కుడి మోచేతికి గాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shubman Gill Injury: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్ నేరుగా గిల్ కుడి మోచేతికి తగలడంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఆ నొప్పి భరించలేక వెంటనే నెట్స్ నుంచి బయటకు వెళ్లాడు టీమిండియా కెప్టెన్.
గిల్‌కు గాయం కావడంతో ముందుగా ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు వైద్య బృందం గిల్‌ను పరిశీలించింది. దీనితో అతడి కుడి మోచేతికి పట్టీ కట్టారు. ఆ తర్వాత డగౌట్లో విశ్రాంతి తీసుకుంటున్న గిల్ వద్దకు సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ స్వయంగా వెళ్లి గాయం పరిస్థితిని అడిగి తెలుసుకున్నాడు. అయితే నొప్పి తగ్గిన తర్వాత గిల్ మళ్లీ నెట్స్‌లోకి వచ్చి బంతులను ఎదుర్కొన్నాడు. దీంతో టీమిండియా శిబిరంలో కాస్త ఊరట కనిపించింది.
Also Read
- Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
గిల్‌కు గాయం కావడానికి కొద్దిసేపటి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి దాదాపు 20 నిమిషాల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. గత సిరీస్‌కు దూరంగా ఉన్న కోహ్లీ పూర్తి లయలో కనిపించాడు. ఇద్దరూ భారత బౌలర్లతో పాటు స్థానిక నెట్ బౌలర్ల బౌలింగ్‌లో అద్భుతమైన షాట్లు ఆడారు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ జట్టులోని సీనియర్ ఆటగాళ్ల పాత్రను ప్రశంసించాడు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు అద్భుతంగా పనిచేశాడని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు తమకు సౌకర్యంగా అనిపించే సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడేందుకు ఇష్టపడతారని.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి అనుభవజ్ఞుల సహకారం జట్టుకు ఉండటం జట్టు అదృష్టమని ఆయన అన్నారు. సెప్టెంబర్ 27న తొలి వన్డే తిరువనంతపురం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మొదలు కానుంది.
తాజావార్తలు
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!