Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konaseema: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు రాజకీయ వేదికలపై నిలబడి విజయం సాధించిన అరుదైన, ఆసక్తికరమైన ఘటన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికల్లో తండ్రీకూతుళ్లు ఇద్దరూ వేర్వేరు పార్టీల తరఫున పోటీకి దిగి విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయ అభిప్రాయాలు వేరైనా, ప్రజాసేవే లక్ష్యంగా బరిలోకి దిగిన ఈ ఇద్దరి విజయం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేట-2 ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ మద్దతుతో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన పొనుగుపాటి చాందిని విజయం సాధించారు. మరోవైపు, అదే మండలంలోని పలివెల-2 ఎంపీటీసీ స్థానం నుంచి ఆమె తండ్రి పొనుగుపాటి సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఒకే కుటుంబంలో ఒకరు కూటమి, మరొకరు వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తూ విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. కొత్తపేట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి పొనుగుపాటి సత్యనారాయణ. కూతురు కూటమి విజయపరంపరలో భాగమైతే, తండ్రి పార్టీ తరఫున ఒంటరిగా గెలిచి తన ఉనికిని చాటుకున్నారు.
Also Read
- Cheyutha Pensions: గుడ్న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
- Tesla Cybertruck: "మూడేళ్లకే కథ ముగిసింది".. టెస్లా 'సైబర్ ట్రక్' ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
- Mitchell Santner: "వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. అందులో దాచడానికి ఏం లేదు".. కివీస్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- Daryl Mitchell: ఈ పిచ్ మరీ దారుణంగా ఉంది.. ఓటమిపై మిచెల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Konaseema: తండ్రి వైసీపీ.. కూతురు టీడీపీ.. ఎన్నికల్లో ఇద్దరూ గెలుపు..
-
CBI Arrest: విశాఖపట్నంలో లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన అధికారి
-
Cheyutha Pensions: గుడ్న్యూస్.. దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు..
-
Tesla Cybertruck: “మూడేళ్లకే కథ ముగిసింది”.. టెస్లా ‘సైబర్ ట్రక్’ ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు మస్క్ ప్రకటన..
-
Bhogi Pre-Release Event Cancelled: చివరి నిమిషంలో ‘భోగి’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!