Sruthi Hasan : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది శ్రుతిహాసన్. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. వ్యక్తిగత విషయాలతో కొంతకాలం కెరీర్ కి దూరమైనా కానీ, శ్రుతి ఇటీవల వరుస బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ.. రజనీకాంత్ కూలీలోనూ నటిస్తోంది. రజనీ కాంత్, లోకేష్ కనగరాజ్ ల కాంబోలో వస్తున్న ఈ మూవీ 2025 మేలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రుతిహాసన్ వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో చాలా చర్చ సాగుతోంది. శ్రుతి తొలుత విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన తర్వాత, కొన్నేళ్ల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికాతోనే డేటింగ్ చేసింది. కానీ అతడి నుంచి కూడా ఇటీవల విడిపోయి మానసికంగా కుంగుబాటుకు లోనైంది.
Read Also:Best Songs 2024: ఈ ఏడాది దుమ్ము దులిపిన సాంగ్స్ ఇవే..
తాజా ఇంటర్వ్యూలో ప్రేమ, రిలేషన్ షిప్, పెళ్లి ఆలోచన గురించి శ్రుతిహాసన్ ప్రస్తావించింది. లవ్ లైఫ్, రిలేషన్ లో ఉన్న మజా పెళ్లిలో ఉంటుందని తాను అనుకోవడం లేదని శ్రుతిహాసన్ తాజాగా వ్యాఖ్యానించింది. ప్రేమలో తలమునకలుగా ఉండడం చాలా బావుంటుందని తెలిపిన శ్రుతి, పెళ్లి చేసుకుని ఒకరితో అటాచ్ అవ్వాలంటే భయం వేస్తోంది అని వెల్లడించింది. నేను అందమైన కుటుంబంలో జన్మించాను. ఈ ప్రపంచంలోనే అమ్మా నాన్న ఉత్తమ జంట అని భావించాను. ఇద్దరూ కలిసి పని చేసేవారు. సంతోషంగానే ఉండేవారు. సరదాగా ఉండేది జీవితం. కానీ ఎప్పుడైతే విడిపోయారో అంతా మారిపోయింది. గొడవలు పడుతూ కలిసి ఉండడం కంటే విడిపోవడమే మేలన్న పరిస్థితి వచ్చింది. అయినా కలిసి ఉండటానికి ప్రయత్నించారు.. కానీ కుదరలేదు! అని శ్రుతి చెప్పుకొచ్చింది. కమల్ హాసన్- సారిక జంట 1998లో పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రుతిహాసన్, అక్షర హాసన్ అనే కుమార్తెలు ఉన్నారు. 2004లో కమల్ – సారిక విడాకులు తీసుకున్నారు. పెళ్లిపై శ్రుతి వ్యాఖ్యలను బట్టి తన తల్లిదండ్రుల బ్రేకప్ ప్రభావం తనపై తీవ్రంగా పడిందని అర్థం చేసుకోవచ్చు.
Read Also:Gold Rate Today: వరుసగా మూడోరోజు బాదుడే.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?