2024వ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని రోజుల్లో 2025 మొదలుకాబోతుంది.
2024లో చాలానే మార్పులు, చేర్పులు.. అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల నుంచి ఒలింపిక్స్ వరకు, ఐపీఎల్ నుంచి వరల్డ్ కప్ వరకు ఇలా అనేక రకాల సంఘటనలు ఈ 2024లో చోటు చేసుకున్నాయి.
ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
ఎంతో మంది ఈ సంవత్సరం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా యావరేజ్‌గా నిలిచినప్పటికీ,''కుర్చీ మడతపెట్టి '' సాంగ్ మాత్రం సూపర్, డూపర్ హిట్‌గా నిలిచింది.
యంగ్ ఎన్టీఆర్ నటించిన ''దేవర'' పార్ట్-1 సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ''ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే' పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 'చుట్టమల్లే' సాంగ్ మెలోడీ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ఏడాది చివర్లో వచ్చి అదరగొట్టింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా 'సూసేకి' , 'కిస్సిక్', 'పీలింగ్స్' పాటలు పెద్ద హిట్టయ్యాయి. అయితే వీటిల్లో ఏది పెద్ద హిట్ అని చెప్పడం కొంచెం కష్టమే.