టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్‌లో పక్కటెముకల్లో తీవ్ర గాయం కాగా.. అంతర్గతంగా రక్తస్రావం కావడంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వెంటనే ఐసీయూకి తరలించింది. కనీసం వారం రోజుల పాటు శ్రేయస్ అబ్జర్వేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారట. బ్లీడింగ్ ఆగిపోయి, ఇన్ఫెక్షన్ కాకుంటే షిఫ్ట్ చేస్తామని మేనేజ్‌మెంట్కు వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. మూడు వారాల పాటు ఆటకు శ్రేయస్ దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read: Vangalapudi Anitha: హోంమంత్రి అనిత అత్యవసర సమావేశం!
సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకొనే క్రమంలో.. శ్రేయస్ కిందపడ్డాడు. దాంతో అతడు బలంగా నేలను తాకాడు. ఆ సమయంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన శ్రేయస్‌ను బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. పరీక్షల్లో అతడికి అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు తేలింది. దాంతో అతడిని ఐసీయూలో చేర్చారు. కనీసం నాలుగు నుంచి ఏడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ లేకుంటే శ్రేయస్ డిశ్చార్జ్ అవ్వనున్నాడు. ప్రస్తుతం శ్రేయస్ పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని సమాచారం. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.