Shreyas Iyer: కోహ్లీ రికార్డు బ్రేక్.. ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: బ్రిస్టల్ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో రికార్డులకెక్కాడు. జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఒంటరి పోరాటం చేసిన అయ్యర్ (49 బంతుల్లో 80 నాటౌట్) టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ సరికొత్త రికార్డును సమం చేశాడు. టీ20 క్రికెట్లో ఇంగ్లాండ్‌పై ఒక భారత కెప్టెన్‌గా నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అయ్యర్ అందుకున్నాడు. గతంలో 2021లో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(కెప్టెన్‌గా) ఇంగ్లాండ్‌పై 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు అయ్యర్ అదే స్కోరును సమం చేశాడు. అంతేకాకుండా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒకే ద్విపాక్షిక టీ20 సిరీస్‌లో ఒకటి కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్లు:
80 – శ్రేయస్ అయ్యర్ (2026)
80 – విరాట్ కోహ్లీ (2021)
77 – విరాట్ కోహ్లీ (2021)
73 – విరాట్ కోహ్లీ (2021)
68 – శ్రేయస్ అయ్యర్ (2026)
Also Read
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ఇక, నిన్నటి మ్యాచ్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో చెలరేగిన అయ్యర్.. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలబడ్డాడు. ఇంగ్లాండ్ పేసర్లు ఎక్స్‌త్రా బౌన్స్‌తో భారత టాప్ ఆర్డర్‌ను మరోసారి దెబ్బతీశారు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అవుట్ కాగా, పవర్‌ప్లేలోనే ఇషాన్ కిషన్‌ను (4) జోష్ టంగ్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత స్పిన్నర్ ఆదిల్ రషీద్ తన మొదటి ఓవర్లోనే అబిషేక్ శర్మను (16) అవుట్ చేయడంతో భారత్ 7 ఓవర్లలోనే 48 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. మరో భారీ బ్యాటింగ్ పతనం ఖాయమనుకున్న తరుణంలో కెప్టెన్ అయ్యర్ ముందుండి నడిపాడు. స్పిన్‌ను ఎదుర్కోవడానికి ఐదో నంబర్లో ప్రమోషన్ పొందిన శివం దూబేతో (22) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించి జట్టును కోలుకునేలా చేశారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అయ్యర్ గేర్ మార్చి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు డెత్ ఓవర్లలో తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. సామ్ కరన్ వేసిన 19వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే రాగా.. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్ ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చింది. చివరి ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ (2/20) రెండు వికెట్లు తీయడంతో పాటు అక్షర్ పటేల్‌ను రనౌట్ చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులకే పరిమితమైంది. ఇక రంగంలోకి ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల తేడాతో ఈజీగా గెలిచింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
-
Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
-
India Forex Reserves: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భారత్‌కు బిగ్ బూస్ట్.. బంగారం నిల్వలు కూడా భారీ పెరుగుదల..
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!