Site icon NTV Telugu

AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Aa 23

Aa 23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. AA23 వస్తున్న ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే సగం పార్ట్ షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కి ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.

Also Read : RK x KH : రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే

ఆ తర్వాత స్మాల్ బ్రేక్ తీసుకుని లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమాకు సంబందించి ఒక న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. తన చార్మింగ్ పెర్ఫార్మెన్స్‌తో స్త్రీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రద్ధా కపూర్, తొలిసారిగా అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. సినిమాలో శ్రద్ద పాత్ర కథకు కీలకంగా ఉండనుందని టాక్. తెలుగులో ప్రభాస్ తో నటించిన సాహో తర్వాత శ్రద్ధకు ఇది రెండవ సినిమా. పాన్-ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్‌తో పాటు లోకేష్ మార్క్ ఇంటెన్స్ నెరేషన్‌తో ప్రత్యేకంగా ఉండబోతుంది. అత్యంత భారీ బడ్జెట్ పై టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

Exit mobile version