Shraddha Kapoor : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా వుంది.ఈ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ లైనప్ లో కల్కి తరువాత భారీ సినిమాలే వున్నాయి.ఇదిలా ఉంటే ప్రభాస్ తన సినిమా షూటింగ్ వుంది అంటే చాలు అక్కడ వర్క్ చేసే టెక్నిషియన్స్ అందరికి కూడా స్పెషల్ గా తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తుంటారు.ప్రభాస్ తన ఇంటికి వచ్చిన గెస్ట్స్ కి కూడా పలు రకాల ఫుడ్ తో మర్యాద చేస్తుంటాడు.
Read Also :Kalki 2898 AD : రాంచరణ్ కూతురికి కల్కి టీం స్పెషల్ గిఫ్ట్..
ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాద చుసిన హీరోయిన్స్ ఫిదా అయిపోయి ప్రభాస్ కు స్పెషల్ థాంక్స్ చెబుతూ పోస్ట్స్ కూడా పెడుతుంటారు..తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.ఈ భామ ప్రభాస్ సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలు పోస్ట్ చేయగా ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్ళీ ఎప్పుడు నటిస్తారు అని కామెంట్ చేసారు.. ప్రభాస్ మళ్ళీ తన ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు అని శ్రద్ధ కపూర్ రిప్లై ఇచ్చింది.ఈ భామ ఇప్పటికి ప్రభాస్ పంపించిన ఫుడ్ గుర్తుంచుకుంది అంటే ప్రభాస్ ఏ రేంజ్ లో ఫుడ్ పంపించి ఉంటాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.