Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో అదిరిపోయింది గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఎక్స్ 100 సినిమాతో అద్భుత విజయం అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి తీసిన సినిమా మంగళవారం శుక్రవారం (నవంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా టైటిల్ తో నే సినిమా పై బజ్ క్రియేట్ అయ్యేలా చేసారు మేకర్స్..అయితే తాజాగా గురువారం (నవంబర్ 16) మేకర్స్ రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో మాత్రం అదిరిపోయింది మంగళవారం సినిమాను ఎలా తెరకెక్కించామో, ఎంత రిస్క్ తీసుకున్నామో డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు ఇతర ఆర్టిస్ట్ లు ఈ వీడియోలో వివరించారు. అందులో భాగంగా కొన్ని సీన్లను ఎంత రిస్క్ చేసి తీశారో కూడా మేకర్స్ ఆ వీడియో ద్వారా తెలియజేశారు..నీళ్లలో కొట్టుకుపోతున్న సీన్ తీయడానికి కెమెరామ్యాన్ కూడా బ్రిడ్జ్ పై నుంచి నీళ్లలోకి దూకడం, పొలంలో మంటల మధ్య ఆర్టిస్టులు పరుగెత్తుతున్న సీన్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పాయల్ రాజ్‌పుత్ కూడా తన అనుభవాలను పంచుకుంది. తెలుగులో ఇంత వరకూ ఇలాంటి థ్రిల్లర్ మూవీ రాలేదని డైరెక్టర్ అజయ్ భూపతితోపాటు పాయల్ కూడా చెప్పుకొచ్చింది..
అజయ్ నాకు కథ చెప్పే విధానమే చాలా కొత్తగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.గతంలో అజయ్ భూపతి తెరకెక్కించిన ఆర్ఎక్స్ 100 మూవీలో పాయల్ హాట్ సీన్లలో రెచ్చిపోయింది. ఈ సినిమాలో ఓ గ్రామీణ యువతి పాత్రలో కనిపిస్తోంది. అయితే మంగళవారం మూవీ నుంచి గతంలో వచ్చిన పోస్టర్లలో పాయల్ ఒంటి పైభాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా బ్యాక్ మొత్తం కనిపించేలా ఉన్న పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగించే ఉద్దేశంతో తాము సినిమాలో చాలా రిస్కీ షాట్లు చేశామని, సినిమాటోగ్రఫీ మరో లెవల్లో ఉంటుందని డైరెక్టర్ అజయ్ భూపతి ఈ వీడియోలో చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఉన్న గణగణ మోగాలిరా పాట 400 షాట్ల కలయిక అని ఈ పాట థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ వేరే లెవల్లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేశ్ వర్మ కలిసి ముద్ర మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో మంగళవారం సినిమా నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది
Also Read
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!