Shocking Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు ఉండగా.. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తుంటాయి. ఇకపోతే, తాజాగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ గా మారింది. అది కూడా ఓ బల్లికి సంబంధించిన వీడియో. కాంబోడియా లోని ఒక వ్యక్తి తన ఇంటి వెనుక భాగంలో గోడపై పాకుతున్న బల్లిని చిత్రీకరించి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గోడపై పాకుతున్న బల్లిని వీడియో తీసి పోస్ట్ చేస్తే వైరల్ ఎందుకు అయింది..? అనే కదా మీ అనుమానం.. అక్కడే అసలు విషయం ఉంది. అదేంటంటే..
Read Also:Kia Carens Clavis EV: సింగల్ ఛార్జ్.. 490 కి.మీ రేంజ్! నేటి నుంచి అమ్మకాలు షురూ..!
ఎక్కడైనా సరే బల్లులు గోడల మీద పాకుతున్నప్పుడు అటు ఇటు కదలడం మనం చూసి ఉంటాము. వీడియోలో కనిపిస్తున్న ప్రకారం.. ఓ బల్లి గోడపై అటు ఇటు తిరుగుతుండగా దాని తోకనుండి మంటలు రావడం గమనించవచ్చు. బల్లి అటు ఇటు నడుస్తున్నప్పుడు ఎటువంటి మంటలు రాకపోయినా, కేవలం దానికి తోకను కదిలించినప్పుడు మాత్రం మంటలు చెలరేగడం మనం గమనించవచ్చు. తోకను కదిలించినప్పుడు ఓ ఎలక్ట్రిక్ స్పార్క్ మనకు కనబడుతుంది. ఈ దృశ్యాన్ని గమనించిన అతడు వెంటనే వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అతి తక్కువ సమయంలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Jairam Ramesh: ఏదో బలమైన కారణమే ఉంది.. ధన్‌ఖర్ రాజీనామాపై జైరాం రమేష్ వ్యాఖ్య
ఓరి దేవుడా.. ఇలాంటి బల్లిని ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు అంటూ చాలామంది కామెంట్ చేస్తుండగా, మరి కొందరేమో.. జాగ్రత్త గురువా.. ఆ స్పార్క్ వల్ల మీ ఇంటికి ఏమైనా నష్టం జరగవచ్చు జాగ్రత్తగా ఉండు.. అంటూ మరికొందరు సూచనలు ఇస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి.