పల్లె, నగరం అనే తేడా లేకుండ కుక్కలు ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్ మెంట్లు, హౌసింగ్ అసోసియేషన్లలో కుక్కలంటే చాలామందికి విపరీతమైన భయం. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ సొసైటీలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడం కలకలం రేపింది. పబ్లిక్ లిఫ్ట్ లో ఉన్న బాలికపై కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్ 300 సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన మే 3 సాయంత్రం జరగగా కాస్త ఆలస్యంగా ఈ దాడి విష్యం బయటికి వచ్చింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాత్రు 9 గంటల సమయంలో అమ్మాయి సొసైటీలోని రెండవ టవర్ లిఫ్ట్ నుండి బయటికి వస్తుంది. రెండో అంతస్తులోని లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే ఒక్కసారిగా కుక్క లోపలికి వచ్చి దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read: Viral Video: ఇలాంటి పూలను పెట్టుకుంటున్నారా.. అయితే ప్రమాదంలో ఉన్నట్లే..
వైరల్ వీడియోలో, ఒక అమ్మాయి లిఫ్ట్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత లిఫ్ట్ ఫ్లోర్‌లో ఆగగానే, ఓ కుక్క లోపలికి ప్రవేశించింది. అప్పటికే లిఫ్ట్‌లో ఉన్న అమ్మాయిపై దాడి చేసింది. ఇంతలో ఓ వ్యక్తి కుక్కను అక్కడి నుంచి వెళ్లగొట్టాడు. ఈ దాడిలో ఓ బాలిక గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో యువతి ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. లిఫ్ట్ మొదటి అంతస్తుకు చేరుకున్నప్పుడు, అమ్మాయి బయటకు వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఆ సంస్థ కానీ, పోలీసులు కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
Also Read: Viral Video: పేషెంట్ల వార్డుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న నర్సు.. చివరికి..
గతంలో టవర్ 2లోని అపార్ట్‌మెంట్ 201లో నివసించే ఓ మహిళను కూడా కుక్క కరిచిందని సమాచారం. ఈ కుక్క ఎలాంటి భద్రత లేకుండా లాబీ చుట్టూ తిరుగుతుందని, లిఫ్ట్ డోర్ తెరుచుకోగానే లోపలికి వచ్చి దాడి చేస్తుందని బాధిత బాలిక కుటుంబీకులు తెలిపారు. నోయిడాలో డాగ్ పాలసీ ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కుక్క మూతి తప్పనిసరిగా కప్పుకోవాలని డాగ్ పాలసీ స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Dog attack a teenager in Noida sector-107 society . #Noida #dogattack pic.twitter.com/Il594emIv1
— Jyoti Karki (@Jyoti_karki_) May 7, 2024