సౌత్ కలకత్తా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోనోజిత్ ప్రవర్తనకు సంబంధించి లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ దేబాషిష్ చటోపాధ్యాయ 2018లో కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు పంపిన లేఖను తాజాగా జాతీయ మీడియా సంస్థ “ఆజ్ తక్” స్వాధీనం చేసుకుంది. పోలీసులకు రాసిన ఈ లేఖలో వివిధ క్యాంపస్ కార్యక్రమాల సమయంలో మోనోజిత్ మిశ్రా ప్రవర్తన గురించి అప్పటి ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: Allu Aravind : ఈడీ విచారణపై స్పందించిన అల్లు అరవింద్..
కళాశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో మోనోజిత్ మిశ్రా విఘాతం కలిగించేవాడు. డిసెంబర్ 13, 2018న జరగాల్సిన కళాశాల వార్షిక సామాజిక కార్యక్రమంలో అవాంతరాలు సృష్టిస్తాడని ప్రిన్సిపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తగిన భద్రత కల్పించాలని ప్రిన్సిపాల్ చటోపాధ్యాయ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ప్రధాన కార్యాలయం)కి లేఖ రాశారు. అప్పటి నుంచే నిందితుడు కళాశాలలో వివాదాస్పద వ్యక్తిగా ఉండేవాడు.
READ MORE: Rajnath Singh: 2026 ఆగస్టులోపే నక్సల్స్ను తుడిచిపెట్టేస్తాం..
కాగా… దక్షిణ కలకత్తా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో రాష్ట్రం తరపున వాదించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీనియర్ న్యాయవాది బివాస్ ఛటర్జీని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (SPP)గా నియమించింది. చట్టపరంగా, సామాజికంగా సున్నితమైన ఈ కేసు విచారణను ఛటర్జీ పర్యవేక్షిస్తున్నారు. కేసు యొక్క సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, నిందితులను గత నెల 30వ తేదీన వర్చువల్‌గా కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు ప్రధాన నిందితులైన మోనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీలను కోర్టు జూలై 8 వరకు పోలీసు కస్టడీకి పంపగా, అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ కస్టడీని జూలై 4 వరకు పొడిగించింది.