Airtel Palns Hike: ఎయిర్‌టెల్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్.. పెరిగిన మూడు ప్లాన్‌ల ధరలు!
- ఎయిర్‌టెల్ యూజర్లకు మరో షాక్
- పెరిగిన మూడు డేటా ప్లాన్‌ల ధరలు
- 181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel increase Three Data Packs Price: ప్రముఖ టెలికాం కంపెనీ ‘ఎయిర్‌టెల్’ తమ మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 11 నుంచి 22 శాతం మేర పెంచగా.. కొత్త ధరలు జులై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే రేట్లు భారీగా పెరిగాయని అసంతృప్తిలో ఉన్న యూజర్లకు ఎయిర్‌టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన మూడు డేటా ప్లాన్‌ల ధరలను రూ.60 వరకు పెంచింది. రూ.79, రూ.181, రూ.301 డేటా ప్యాక్‌ల ధరను కంపెనీ పెంచింది.
Rs 79 Plan Hike:
ఎయిర్‌టెల్ రూ.79 డేటా ప్లాన్ ధరను పెంచింది. ఈ ప్లాన్ ధరపై రూ.20 పెంచడంతో ఇప్పుడు రూ.99కి అందుబాటులో ఉంది. ఈ డేటా ప్లాన్ కస్టమర్లకు ప్రతిరోజూ 20జీబీ డేటాను అందిస్తుంది.
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
Rs 181 Plan Hike:
ఎయిర్‌టెల్ తన రూ.181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది. దాంతో ఈ ప్లాన్ ధర రూ.211కు చేరింది. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. రోజుకు 1GB డేటాను పొందుతారు. రెగ్యులర్ ప్లాన్ డేటాతో పాటు అదనంగా 1జీబీ డేటా అవసరమైన వారు ఈ ప్లాన్ వాడుతున్నారు.
Also Read: Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Rs 301 Plan Hike:
రూ.301 డేటా ప్లాన్‌పై రూ.60 పెరిగింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ.361గా ఉంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు 50జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. బేస్ ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ 50జీబీ డేటాను వాడుకోవచ్చు. ఈ మార్పులతో ఎయిర్‌టెల్ యూజర్లపై మరింత భారం పడింది.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!